ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించ తలబెట్టిన స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్నయించింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేస్తూ, ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటర్లు హాజరుఅవుతారని, ప్రధానంగా పేపర్ బ్యాలెట్స్ తో ఎన్నికలు జరుగుతున్నందున జరిగే ప్రక్రియకు అధిక సమయం పట్టడంతో పాటు క్యూలైన్లలో ఉండే మనుషులు ఒకరికొకరు తగిలే అవకాశం ఎక్కువ గా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం కరోనా ముప్పు ఎక్కువగా ఉన్నందునా తప్పడం లేదు. ఎన్నికలు జరపడం ముఖ్యమైనా, ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
అయితే ఎన్నికల కోడ్ ను యథావిధిగా కొనసాగిస్తామని రాష్ట్ర ఎన్నికల అధికారి రమేశ్ కుమార్ మీడియా ముందు స్పష్టం చేశారు. ఇది కేవలం నిలిపివేత మాత్రమే. రద్దు కాదు. ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియ రద్దు కాదు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు. ఆరు వారాల తర్వాత సమీక్ష తర్వాత వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ మేరకు నోటిఫికేషన్లలో మార్పులు తీసుకువస్తామని రమేష్ కుమార్ ప్రకటించారు.