రానా దగ్గుబాటి సమర్పణ‌లో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంరానా దగ్గుబాటి సమర్పణ‌లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ‘గుంటూర్ టాకీస్’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’.. శుక్రవారం వేలంటైన్స్ డే సందర్భంగా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ టీజర్ ను హీరో విక్టరీ వెంకటేష్ ఆవిష్కరించారు.

వెంక‌టేష్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ… ‘క్షణం’తో పరిచయమై ద‌ర్శ‌కుడిగా సంచలనం సృష్టించిన రవికాంత్ పేరెపు మ‌రో డిఫరెంట్ స్టోరీతో వ‌స్తున్న ఈ టీజర్ ఆసక్తి కలిగిస్తోందని అన్నారు శ్రీచరణ్ పాకాల అందిస్తున్న సంగీతం బాగుంద‌ని అన్నారు. 

చిత్ర ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ మాట్లాడుతూ స‌మాజంలో వైరల్ అయిన రూమర్స్ ఆధారంగా రాపిన క‌థ ఇద‌ని చెప్పారు. రాంగ్ టైమ్ రిలేషన్ షిప్స్ తో సిద్ధు జొన్నలగడ్డ . శ్రీకృష్ణ పరమాత్ముడి తరహాలో పలువురు భామలతో అతను సరసాల్లో మునిగితేలుతూ చిక్కుల్లో ప‌డ‌తాడు హీరోయిన్లుగా శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని వడ్నికత్తి నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్ తెలిపేలా ‘పులిహోర కలిపెనులే’ అంటూ వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ నవ్విస్తుంది. ఈ ‘పులిహోర’ ట్రాక్ ను గాయ‌కుడు హేమచంద్ర రచించి పాడార‌ని చెప్పారు.


Leave a Reply

Your email address will not be published.