అల్లూ అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీవాసు

అల్లూ అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీవాసు నిర్మాత‌గా కార్తికేయ హీరోగా న‌టిస్తున్న చావుక‌బురు చ‌ల్ల‌గా షూటింగ్ గురువారం ఆరంభం కానుంది. ఈ మేర‌కు చిత్ర యూనిట్ కార్తికేయ ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేసింది .కౌశిక్ పిఎస్‌కె ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి జిబీ సంగీతాన్ని అందిస్తున్నారు. 
వైవిధ్య‌భ‌రిత పాత్ర‌లందుకుంటూ త‌న‌దైన ప్ర‌త్యేక‌త నిరూపించుకుంటున్న కార్తికేయ ఈ చిత్రంలో బ‌స్తీ బాల‌రాజుగా క‌నిపించ‌బోతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక పూర్త‌య్యింద‌ని ప్రారంభోత్స‌వ సంద‌ర్భంగా సాంకేతిక నిపుణులు, న‌టీన‌టుల వివ‌రాల‌ను నిర్మాత ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని ఫిలింన‌గ‌ర్ టాక్‌.
 

Leave a Reply

Your email address will not be published.