బాల‌య్య‌కు సెట్ కాని విగ్గులు… మీడియాలో ట్రోలింగ్ వైర‌ల్‌?


నందమూరి నటసింహం నటించిన తాజా చిత్రం రూలర్. కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు దారుణంగా ఫెయిల్‌ కావటంతో బాలయ్య అభిమానులు ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. గతంలో బాలయ్య హీరోగా జైసింహా సినిమాకు దర్శకత్వం వహించిన కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సీ కళ్యాణ్‌ నిర్మిస్తున్నాడు. బాలయ్య రెండు డిఫరెంట్‌ లుక్స్‌లో నటిస్తున్న ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదికలు హీరోయిన్లుగా నటిస్తుండగా జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌, శియాజీ షిండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక ఈ చిత్ర ట్రైల‌ర్, టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే బాల‌య్య లుక్ ట్రైల‌ర్ లో చూడ‌లేక‌పోతున్నామ‌ని కొంద‌రు సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అలాగే యంగ్ పాత్ర‌లో ఆయ‌న పెట్టిన విగ్గులు సెట్ కాలేద‌ని. సీజీ వ‌ర్క్ కూడా చాలా డ‌ల్‌గా ఉంద‌ని అంటున్నారు. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే యాక్షన్‌, పంచ్‌ డైలాగ్‌లు, హీరోయిన్లతో రొమాన్స్‌ లాంటి అంశాలు అన్నీ గతంలో బాలయ్య సినిమాల్లో చాలా సార్లు చూసినట్టుగానే ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో రూలర్‌ బాలయ్య ఫ్యాన్స్‌కు మాత్రమే అంటున్నారు  కొంద‌రు విశ్లేషకులు. క‌థ, క‌థ‌నాలు కూడా దాదాపు అలానే ఉన్నాయి. మొత్తానికి అంద‌రూ పాత చింత‌కాయ ప‌చ్చ‌డే అన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా బ‌ల‌య్య‌ పోలీస్ గెటప్‌లో  విగ్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. మరో లుక్‌ కూడా ఐరన్‌ మ్యాన్‌లా ఉందంటున్నారు ఫ్యాన్స్‌. ఇక మ‌రి బాల‌య్య అదృష్టం ఎలా ఉండ‌బోతుందో రేపు సినిమా విడుద‌లైతే గాని అర్ధం కాదు. ఎప్ప‌టి లాగే కేవ‌లం మాస్ ప్రేక్ష‌కుల‌ను మాత్రమే ఆక‌ట్టుకుంటాడా లేక అంద‌ర్నీ ఆక‌ర్షిస్తాడా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఏది ఏమైన‌ప్ప‌టికీ బాల‌య్య‌కి రూల‌ర్ చిత్రం కూడా మ‌ళ్ళీ దెబ్బ ప‌డేలానే ఉంది. ఓ ప‌క్క ఆయ‌న లుక్స్‌, మ‌రో ప‌క్క థియేట‌ర్ల క‌ష్టాలు బాల‌య్య ఎలా గ‌ట్టెక్కుతాడో చూడాలి. 

Leave a Reply

Your email address will not be published.