రాజ్యసభకు ప్రియాంక ? పార్టీకి కొత్త జ‌వ‌స‌త్వాలుఇటీవ‌ల జ‌రిగిన ఢిల్లీ ఎన్నిక‌ల‌లో ఘోర పరాభవం పూల‌మ్మిన చోట క‌ట్టెల‌మ్ముకునే ప‌రిస్థితికి పార్టీ చేర‌టంతో ఖంగుతిన్న కాంగ్రెస్ అధిష్ఠానంపార్టీకి కొత్త ఊపు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు క‌నిపిస్తోంది. ఇందుకు గానూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి   ప్రియాంకతో పాటు మరికొందరు జూనియర్లను కూడా రాజ్యసభకు  పంపించాలని సోనియా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ప్ర‌స్తుతం రాజ్యసభ సభలో సీనియర్లైన అంబికా సోనీ, గులాంనబీ ఆజాద్, దిగ్విజయ సింగ్ కాల పరిమితి ముగుస్తుండ‌టంతో త‌మ‌ను రెన్యూల్ చేయాలంటూ నేత‌లు డిమాండ్ చేస్తున్నా, యువ‌ర‌క్తంలో పార్టీకి కొత్త జ‌వ‌స‌త్వాలు తీసుకురావాల‌ని సోనియా నిర్ణ‌యించిన‌ట్టు పార్టీలోని ఓ వ‌ర్గం చెపుతోంది.  ఇప్ప‌టికే పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, జార్ఖండ్ ల‌లో పార్టీకి సీరియ‌స్‌గా ప‌నిచేస్తున్న నేతలను ఎంపిక చేసి పెద్ద‌ల‌స‌భ‌కు పంపాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.  ఈ క్ర‌మంలోనే ప్రియాంక‌తో స‌హా మ‌రి కొంద‌రికి అవ‌కాశం ద‌క్కే ఆస్కారం ఉంది. 

కాగా కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్న రాహుల్ గాంధీ తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌ను నిర్ధిష్టంగా ఎదుర్కొన లేక‌పోతున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా ఉన్న సోనియానే ఈ బాధ్య‌త‌ల‌ని నిర్వ‌హించాల్సి వ‌స్తుండ‌టంతో పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప్రియాంక రాజ‌కీయాల‌లో మ‌రింత యాక్టివ్‌గా ప‌నిచేసే ఆస్కారం క‌నిపిస్తోంద‌ని, ప్ర‌భుత్వాన్ని నిల‌దీసేందుకు ప్ర‌జ‌ల త‌ర‌పున గొంతుక అయ్యేందుకే ఆమెను రాజ్య‌స‌భ‌కు పంపిస్తున్న‌ట్టు కాంగ్రెస్ నేత‌లు కొంద‌రు మీడియాకు చెప్పారు. 

Leave a Reply

Your email address will not be published.