చంద్రబాబుకు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలిచంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ మండిపడ్డారు. పవన్‌కల్యాణ్‌ స్థిరత్వం లేని నాయకుడు అని ఎద్దేవా చేశారు. రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారని విమర్శించారు. అధికార వికేంద్రీకరణ కోరుతూ శ్రీకాకుళంలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. చంద్రబాబు మద్దతుతో కొంతమంది మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ముంటే నరసన్నపేటలో తనపై పోటీ చేసి గెలవాలని కృష్ణదాస్‌ సవాల్‌ విసిరారు. లక్ష కోట్ల రాజధాని ఏపీ అభివృద్ధికి దోహదపడదని తేల్చిచెప్పారు. లక్ష కోట్లతో సాగునీటి ప్రాజెక్టులు ప్రతిపాదిస్తే రాష్ట్రం శాశ్వతంగా సుభిష్టంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని చెప్పారు. 
 

Leave a Reply

Your email address will not be published.