ఢిల్లీలో ఎన్కౌంటర్
ఢిల్లీలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు వాంటెడ్ క్రిమినల్స్ హతమయ్యారు. ఇవాళ ఉదయం 5 నుంచి 5:30 గంటల ప్రాంతంలో జరిగిన పోలీసులు, నిందితుల మధ్య 30 రౌండ్ల కాల్పుల ఘటన లో వీరు చనిపోయినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులు మీడియాకు అందిస్తూ, ఈ ఎన్కౌంటర్లో రాజా ఖురేషీ, రాజా బహుదూర్ మృతిచెందారని, ఇద్దరు కూడా పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారనిఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసు అధికారులు తెలిపారు..
అలాగే ఇటీవల కారావాల్ నగర్ లో జరిగిన మర్డర్ కేసులో వీరు నింధితులని వీరు ఇద్దరు పారిపోతూ… పోలీసులపైకి కాల్పులకు పాల్పడ్డారు. దీంతో వారిపై పోలీసులు ఎదురు కాల్పులు జరిపి ఇద్దరిని హతమార్చారు. మరింత సమాచారం తెలియాల్సివుంది.