‘వలయం‘ హీరో మరియు నిర్మాత లక్ష్ మీడియా తో చిట్ చాట్

శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరా ఫిలిమ్స్ బ్యానర్ పై పద్మావతి చదలవాడ నిర్మిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘వలయం‘. చదలవాడ బ్రదర్స్ సమర్పిస్తోన్న ఈ చిత్రం ద్వారా రమేష్ కడుముల దర్శకుడిగా పరిచయమవుతుండగా చదలవాడ లక్ష్ హీరోగా, దిగంగన సూర్యవంశీ నాయికగా నటిస్తోంది, ఫిబ్రవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా హీరో మరియు నిర్మాత లక్ష్ మీడియాలో చిట్ చాట్ చేసారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మీ వలయం సస్పెన్స్ థిల్లర్‌గా కనిపిస్తోంది..
అవును … కానీ సరికొత్తగా ఉంటుంది. అనుకోకుండా హీరో భార్య దిశ ఒక రోజు అర్ధంతరంగా కనిపించకుండా పోతుంది. ఆమె మాయమై పోవడానికి కారణం ఏంటి? ఎవరైనా కిడ్నాప్ చేసారా? ఆమే పారిపోయిందా? అనే ఉత్కంఠల నడుమ సినిమా నడుస్తుంది. ఇందులో నా పాత్రని కూడా ప్రేక్షకులుఅనుమానించే తీరుగా సాగుతుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు ప్రేక్షకులను తరువాత ఏం జరగబోతోంది అని కుర్చీ చివర్లలో కూర్చోబెట్టే సినిమా అని మాత్రం చెప్పగలను.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటనతో సినిమాకు సంబంధం ఉందా?
లేదండి. దిశ ఘటనకు మా సినిమాకు సంబంధం లేదు. ఈ ఘటనకు ముందే ఈ స్క్రిప్ట్ దర్శకుడు రాసుకున్నారు. ముందు ఈ సినిమాకి దిశ అనే పేరనుకున్నాం. . దిశ పేరు కొంచెం సాఫ్ట్ గా ఉండటంతో పాటు, లేడీ ఓరియెంటెడ్ మూవీ అనే భావన కలిగేలా చేస్తుండటంతో కథకు తగ్గట్టు వలయం అని టైటిల్ పెట్టడం జరిగింది. నిజానికి దిశ సంఘటన జరిగే నాటికి మా సినిమా డబ్బింగ్ ప్రారంభమైంది. దిశ లాంటి సున్నితమైన ఘటన మా సినిమా ప్రచారానికి వాడుకున్నట్లు ఉంటుందని కొందరు అనడంతో హీరోయిన్ పేరు మార్చాలని ప్రయత్నించినా డబ్బింగ్ లో లిప్ సింక్ అవ్వలేదు. అందుకే మార్చలేకపోయాం.
తొలిసారి నిర్మాతగానూ, హీరోగా చేస్తున్నట్టుంది
నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చాను. ఓ మూడు సినిమాలలో నటించా. హీరోగా మారాక నాలుగు చిత్రాలని చేసా, తరువాత నిర్మాతగా మారి`బిచ్చగాడు` సినిమా మా బ్యానర్ మీద చేసాను. మంచి కథ, కథనం ఉన్న సినిమాలని టైటిల్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వలయం సినిమా కూడా సరికొత్త కథ కావటంతో మొదటిసారి నేనే ఇన్వాల్వ్ అయ్యి నిర్మించిన సినిమా . కేవలం సినిమా మీద ఉన్న ఫ్యాషన్ తో మళ్లీ నటించాను. నా రీ ఎంట్రీ కి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుండి సపోర్ట్ ఉంది. దీన్ని కూడా ప్రేక్షకులు ఆస్వాదిస్తారని నమ్మకం ఉంది. ఇక నిర్మాతగా కన్నా హీరోగా చేయడం కొంచెం కష్టం అనిపించినా, తెరమీద బాగా వచ్చింది. ఈ పాత్ర కోసం 25 కేజీలు బరువు తగ్గా, ఫైనల్ గా మంచి సినిమా తీశామన్న సంతోషం ఉంది.
మీ ఫాదర్ సహకారం ఎలా ఉంది?
నాన్నగారు నన్ను చిన్నప్పటి నుండి బాగా ప్రోత్సహిస్తున్నారు. బాలనటుడిగా, హీరోగా, నిర్మాతగా ఇలా నేనేం చేసినాఆతని సూచనలు ఉంటాయి. నేను నిర్మాతగా ఈ సినిమా తీస్తానని అంటే దర్శకుడు సూచనలతో మళ్ళీ నటనవైపు దృష్టి పెట్టినప్పుడూ ఆతని ప్రోత్సాహం అంతా ఇంతా కాదు.
ఎంత ఫాస్ట్‌గా వచ్చారో అంత ఫాస్ట్‌గా వెనక్కి వెళ్లి మళ్లీ వచ్చినట్టున్నారు.?
మీరన్నది నిజమే… బాల నటుడిగా ఇండస్ట్రీకి వచ్చి తరువాత దూరం అయ్యాను. తదుపరి 16వ ఏట హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చాను, నా మొదటి సినిమా ‘నీతో వస్తా’ అందులో రిమా సేన్ హీరోయిన్, 786 అందులో హంసా నందిని కథానాయిక, ఇక నేను చేసిన మేస్త్రి, శంకర్ చిత్రాలు బాగా ఆడాయి. కానీ ఎందుకో చాలా గ్యాప్ వచ్చింది. ఎంత ఎర్లీగా వచ్చానో, అంత ఎర్లీగా ఇండస్ట్రీకి దూరం అయ్యాను. కానీ ఇప్పుడు వలయం తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఇక కంటిన్యూగా ఇక్కడే ఉంటా. సినిమాలు చేస్తునే ఉంటా…
బిచ్చగాడు లాంటి హిట్ సినిమా తీసిన మీరు నిర్మాతగా, హీరోగా భవిష్యత్ ప్రోజక్టులు ఏంటి?
అవును బిచ్చగాడు సినిమా ప్రొడ్యూసర్‌గా నన్ను నిలబెట్టింది. ప్రేక్షకులకు ఓ కొత్తదనాన్ని ఇచ్చింది. అది ఒక వండర్ గా చెప్పుకోవచ్చు. ఇక నటుడిగా, హీరోగా కంటిన్యూ అవుతా, ఇప్పటికే కొన్ని స్క్రిప్ట్స్ వింటున్నాను . నేను నిర్మాతగా చేయటమా? వేరే బ్యానర్లో నటించడమా? అన్నది చూడాలి. త్వరలో పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను