నటవారసుడు ఛాలెంజ్ నెగ్గుతాడా?

నటవారసత్వం కత్తి మీద సాములాంటిది. సినీబ్యాక్ గ్రౌండ్ ఒక రకంగా ఎంత పెద్ద ప్లస్ అవుతుందో, అంతకుమించి మైనస్ అవుతుందనడానికి ఉదాహరణలు ప్రత్యక్షంగానే ఉన్నాయి. నటవారసత్వం అనేది తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది. ప్రస్తుతం చియాన్ విక్రమ్ నటవారసుడు ధృవ్ అలాంటి సన్నివేశాన్నే ఎదుర్కొంటున్నాడు. ధృవ్ హీరోగా దేవరకొండ ౠఅర్జున్ రెడ్డిౠ రీమేక్ ని ఈ 4 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ముఖేష్ ఆర్.మెహతా సమర్పణలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి వర్మ అనే టైటిల్ ప్రకటించి.. చిత్రీకరణ మొత్తం పూర్తి చేశాక డైరెక్టర్ బాలాతో నిర్మాతలకు ఏర్పడిన మనస్ఫర్థల వల్ల మొత్తం చిత్రాన్ని స్క్రాప్ లో వేసేస్తున్నామని ప్రకటించడం సంచలనమైంది. సినిమా సరిగా రాలేదు. అందుకే దీనిని చెత్త బుట్టలో పడేసి మళ్లీ సినిమా చేస్తామని నిర్మాతలు ప్రకటించడంపై ఆసక్తికర చర్చ సాగింది. ఈ విషయంలో నొచ్చుకున్న బాలా .. ఒక యువహీరో లైఫ్, కెరీర్ దీంతో ముడిపడి ఉంది కాబట్టి తాను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. చియాన్ విక్రమ్ కి శివపుత్రుడు లాంటి సెన్సేషనల్ హిట్ చిత్రాన్ని, జాతీయ అవార్డు చిత్రాన్ని అందించిన గ్రేట్ డైరెక్టర్ బాలా తో ఎక్కడ తేడా వచ్చిందో కానీ ఊహించనిదే జరిగింది. అదంతా అటుంచితే తాజాగా అర్జున్ రెడ్డి రీమేక్ కు ‘ఆదిత్య వర్మ’ అనే టైటిల్ ని ప్రకటించి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇందులో ధృవ్ పూర్తిగా కొత్తగా కనిపిస్తున్నాడు. అయితే అర్జున్ రెడ్డి ప్రభావం ఉందని అర్థమవుతోంది. ఆసక్తికరంగా ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి ఒరిజినల్ వెర్షన్ కు అసిస్టెంట్ గా పని చేసిన గిరీశం దర్శకత్వం వహిస్తున్నారు. ధృవ్ సరసన బాలీవుడ్ కథానాయిక బానిట సంధు ఓ నాయిక.  ప్రియా ఆనంద్ మరో నాయికగా ఓకే అయ్యింది. రవి.కె. చంద్రన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంగీత దర్శకుడిగా రధన్ పని చేస్తున్నారు.. 

Leave a Reply

Your email address will not be published.