‘వరల్డ్ ఫేమస్ లవర్‘ తో చిట్ చాట్


వెంకీమామ, ప్రతి రోజు పండగే ఇలా వ‌రుస సూప‌ర్ హిట్ల‌తో ప్రేక్ష‌కుల మ‌దిని దోచుకున్న రాశిఖన్నాతాజాగా విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్‘ తో మ‌రోమారు ప్రేక్ష‌కుల‌ని మైమ‌రిపించేందుకు ప్రేమికుల రోజున రానుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ రాశీ ఖన్నా మీడియాతో ముచ్చటించారు 


వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది? 


చెప్పేస్తే థ్రిల్ పోతుంది క‌దా… ఏదైనా స‌రే ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్తా… నేను ఇప్పటి వరకు చేసిన చిత్రాలతో పోలిస్తే వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశానని మాత్రం చెప్తా.. ఆ విషయం ఇప్పటికే ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి అర్ధం అయిపోయిది క‌దా? గే టీజ‌ర్‌, ట్రైలర్ చూసిన వాళ్లంతా కథ ఇది అంటూ ర‌క‌ రకాలుగా అనుకుంటున్నారు. అయితే వారు ఊహించ‌ని విధంగా ఇదొక స్వీట్ సర్ప్రైజ్ సినిమా అవుతుంద‌ని మాత్రం చెప్ప‌గ‌ల‌ను. 


మీ క్యారెక్ట‌ర్‌లో బాగా ఇన్‌వాల్వ్ అయిన‌ట్టున్నారే…. ?


ఈ సినిమాలో నేను యామిని.అనే పాత్ర చేస్తున్నా, మ‌న‌తో క‌ల‌సి న‌డిచే అమ్మాయిలా క‌నిపిస్తాను. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. నేను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన‌ ఏ క్యారెక్టర్ తో ఇంత రిలేట్ అవ్వలేదు. నా లైఫ్ స్టైల్‌కి చాలా దగ్గరగా ఉండే పాత్ర. ఇది అంత‌గా నాలో క‌లిసిపోయింది. నేను కూడా రిలీజ్ కోసం మీలాగే చాలా ఆస‌క్తిగా వెయిట్ చేస్తున్నా


రెండు రోజుల్లో మీ క్యారెక్ట‌ర్‌కి డబ్బింగ్ చెప్పార‌ట‌గా?


అవును… ఆ పాత్ర ఎంత న‌చ్చిందో చెప్ప‌లేను. అందుకే కేవలం రెండు రోజుల్లో డబ్బింగ్ చెప్పగలిగాను. నా దృష్టిలో ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ సైడ్ ఉంటుంది. అది అబ్బాయి కావ‌చ్చు, అమ్మాయి కావ‌చ్చు. అయితే ఎమోష‌న‌ల్ ఎక్కువ స్ట్రాంగ్ గా ఉన్న అమ్మాయిలు దానిని అందరి ముందు ప్ర‌ద‌ర్శించాల‌నుకోరు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కూడా అలాంటిదే కావ‌టం విశేపం. 


విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాతో కొత్త‌గా ట్రై చేశాడంటున్నారు నిజ‌మేనా ?


ఈ మూవీ టైటిల్ చూస్తునే కొంత అర్ధ‌మ‌వుతుంది క‌దా… రేపు సినిమా విడుదలయ్యాక అది స‌రైన‌ యాప్ట్ అని మీరే నమ్ముతారు. విజయ్ థియేటర్ బ్యాక్ గ్రౌడ్ నుండి వచ్చిన వాడు కావ‌టంతో ఏ ఎమోషన్ ని అయినా ఈజీ గా పలికించేస్తుంటాడు. ఆత‌నితో ప‌ని చేస్తున్నంత సేపు ఎం ఎంజాయ్ చేశానో నాకే తెలియ‌దు. ఎలాంటి సందర్భంలో అయినా , క్లిష్ట స‌న్నివేశం వ‌చ్చినా విజయ్ అస్సలు భయపడడు, పైగా అంద‌రినీ ప్రోత్సహిస్తూ, త‌న‌ క్యారెక్టర్ లోకి లీన‌మై పోవ‌టం నాకు బాగా న‌చ్చింది. ఈ సినిమాలో విజయ్ ఒక న్యూ థీమ్ ని ట్రై చేశాడు, దానికి అందరూ కనెక్ట్ అవుతారు క‌చ్చితంగా…


మిగిలిన క్యారెక్ట‌ర్స్‌లో మీకు న‌చ్చిన క్యారెక్ట‌ర్ ఏంటి?


అవును ఈ సినిమాలో డ్యుయ‌ల్ రోల్ చేసే అవ‌కాశం వ‌చ్చి ఉంటే నేను డా ఐశ్వర్య రాజేష్ చేసిన క్యారెక్టర్ న‌టించేదాన్ని, ఆ పాత్ర క్యారెక్ట‌రైజేష‌న్ చాలా బాగుంది. ఐశ్వ‌ర్య‌కి మంచి పేరు తీసుకు వ‌స్తుంది ఆ పాత్ర‌, ఆమె చాలా చ‌క్క‌గా చేసింది. ఆమె న‌టుల కుటుంబంలోనే పుట్టింద‌ని షూటింగ్ గ్యాప్‌లో తెలిసింది. వార‌స‌త్వంగా న‌ట‌న ఆమెలో జీర్ణించుకుపోయిన‌ట్టు క‌నిపించింది. 


టోట‌ల్‌గా సినిమా ఎలా వ‌చ్చిందంటారు?


నేను చాలా ఎమోషన్ పర్సన్ని..క్రాంతి గారు ఈ సినిమా నరేట్ చేస్తున్నపుడు నేను వేరే లోకానికి వెళ్లి పోయాను. ఒకరకంగా చెప్పాలంటే కొన్ని స‌న్నివేశాల‌లో న‌టిస్తున్న‌ప్పుడు నాకు తెలియ‌కుండానే ఏడ్చేసాను. అంతగా ఈ స్క్రిప్ట్ తో కనెక్ట్ అయ్యాను. క్రాంతి గారు కూడా సినిమాలోని ప్ర‌తి స‌న్నివేశం అద్భుతంగా తెరకెక్కించారు. రేపు ధియేట‌ర్‌లో మీరు క‌చ్చితంగా ఆ ఫీల్ పొందుతారు. 


మీ సినిమా విడుద‌ల‌వుతున్న ప్రేమికుల రోజు గురించి చెప్పండి ?


నేను చాలా మంది నోట‌ వేలంటైన్ డే అంటే ఇష్టం ఉండదని విన్నాను. కానీ నాకు చాలా ఇష్టం.. ప్రేమంటే స‌ర్వ‌జ‌నీనం. ప్రేమికులంటే ఆడ‌,మ‌గ మాత్ర‌మే కాదు. అమ్మ ప్రేమ నుంచి ఆరంభిస్తే, ఎదుటివారిని కూడా మ‌నం ప్రేమించ‌గ‌ల‌గాలి. 


మీ త‌దుప‌రి చిత్రాలేంటి?


ప్రస్తుతం తెలుగులో రెండు స్క్రిప్ట్స్ వింటున్నాను ఇంకా ఫైనల్ కాలేదు.. ఇత‌ర భాష‌ల‌లో ఓ రెండు సినిమాలు చేస్తున్నా… ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి అవి.


Leave a Reply

Your email address will not be published.