విశాఖ‌ను రాజ‌ధానిని ఎందుకు చేయ‌కూడ‌దో…చెప్పండి


అమరావతి..రాష్ట్రానికి మధ్యస్తంగా ఉంటుందన్న వాదన సరికాదని, ఇదే అంశాన్ని శివరామకృష్ణన్ కమిటీ స్వయంగా చెప్పినా  ప‌ట్టించుకోలేద‌ని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. మంగళవారం ఆయన శ్రీ‌కాకుళంలోని త‌న నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కొత్త న‌గ‌రం అంటే ల‌క్ష‌ల కోట్లు కావాలి అని ప్రకటించారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకముందే అమరావతిని ప్రకటించారని ఆరోపించారు.  విభజన చట్టంలోని అంశాలను విస్మరించడం వ‌ల్లే రాజ‌ధానిని విశాఖ‌కు మార్చాల్సి వ‌చ్చింద‌ని, నాలుగున్న‌రేళ్లు స‌మ‌యం ఇంకా ఉంద‌ని, అమ‌రావ‌తి రైతులు చంద్ర‌బాబు ఉచ్చునుంచి బైట‌కు  రావాల‌ని పిలుపునిచ్చారు  ధర్మాన.   ప్ర‌జ‌లు ఓడించి మూల కూర్చొబెట్టినా ప్రాంతీయ విభేదాలు సృష్టించి, రాజ‌కీయ చ‌లి కాచుకోవాల‌ని చంద్ర‌బాబు చూస్తున్నార‌ని, ఆత‌ని వైఖ‌రిని తెలుగుదేశం శాస‌న‌స‌భ్యులే త‌ప్పుప‌డుతున్నార‌ని ఎద్దేవా చేసారు. విశాఖ‌ను రాజ‌ధానిని ఎందుకు చేయ‌కూడ‌దో… దానికి ఉన్న అన‌ర్హ‌త‌లేమిటో చెప్పాల‌ని చంద్ర‌బాబును ధ‌ర్మాన నిల‌దీసారు.  


Leave a Reply

Your email address will not be published.