సినిమాల్లోకి రాకముందు జాతీయ స్థాయిలో గోల్ఫ్ ఆటలో క్రీడాకారిణి గా రకుల్సినిమాల్లోకి రాకముందు జాతీయ స్థాయిలో గోల్ఫ్ ఆటలో క్రీడాకారిణి గా మెరుపులు మెరిపించిన రకుల్ ప్రీత్ సింగ్  సినీ న‌టిగా త‌న‌కంటూప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. సినిమాల‌ బిజీ షెడ్యూల్ వల్ల ఎక్కువగా గోల్ఫ్ ఆడలేకపోతున్నానన్న బాధను ఎప్ప‌ట్టిక‌ప్పుడు వ్య‌క్తం చేస్తునే ఉంది. ఇందుకోసం ఆమె సినీ కెరీర్ కోసం త్యాగం చేయక తప్పడం లేదని చెపుతోంది. వీలైనప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా గోల్ఫ్ ఆడడానికి, ఫిట్ నెస్ కూ సమయాన్ని కేటాయించుకునే రకుల్  పుణేలోని గోల్ఫ్ కోర్ట్ లో సందడి చేసింది.


 ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ కూడా మోడ్రన్ అటైర్ లో ఆమెతో కలసి గోల్ఫ్ ఆడటం విశేషం.   అన్న‌ట్టు ర‌కూల్‌కి గుర్రపుస్వారీ అంటే  చాలా ఇష్టమ‌ట‌, అంతెకాదు ఈ అమ్మడు కరాటేలో బ్లూబెల్ట్ కూడా సాధించి   ప్రతిభావంతురాలైన కరాటే ప్ర‌ద‌ర్శ‌న‌లు కూడా ఇస్తోంది.  

Leave a Reply

Your email address will not be published.