విజ‌య్‌దేవ‌ర‌కొండ‌కి వాళ్ళ పై క్ర‌ష్ ఉందా…?

క్రేజీ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ని ఇష్ట‌ప‌డని అమ్మాయిలు ఎవ్వ‌రూ ఉండ‌రు. ప్ర‌జంట్ ట్రెండ్‌ని ఫాలో అయ్యే హీరో వెన‌కే ప్ర‌స్తుతం యూత్ మొత్తం ప‌రుగెడుతుంది. అయితే విజ‌య్ మాత్రం ఇద్ద‌రు అమ్మాయిలతో క్ర‌ష్ ఉండేదని కాని వాళ్ళ‌కు పెళ్ళైపోయింద‌ని అన్నాడు. అయితే వాళ్ళిద్ద‌రూ ఎవ‌రో కాదండోయ్ బాలీవుడ్ బ్యూటీస్ దీపిక పదుకోన్, ఆలియా భట్‌లపై విజయ్‌కు క్రష్ ఉండేదట. కానీ దీపిక.. రణ్‌వీర్ సింగ్‌ని పెళ్లి చేసేసుకుందని, ఆ తర్వాత ఆలియా భట్‌ కూడా రణ్‌బీర్ కపూర్‌తో డేటింగ్‌లో ఉందంటూ బాధపడ్డాడు.

ఫిలిం కంపానియన్ అనే వెబ్‌సైట్ ఇటీవల టాప్ 100 గ్రేటెస్ట్ పెర్ఫామెన్సెస్ పేరుతో ఓ డిబేట్ ఏర్పాటుచేసింది. ఈ డిబేట్‌కు ఆలియా భట్, దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్, మనోజ్ బాజ్‌పాయ్, విజయ్ దేవరకొండ, ఆయుష్మాన్‌ ఖురానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు దీపిక, ఆలియాపై క్రష్ ఉండేదని విజయ్ అన్నారు. ‘ఇక్కడ కూర్చున్న చాలా మందికి దీపిక పదుకొనే, ఆలియా భట్‌లపై క్రష్ ఉంది. నాకు కూడా ఉంది. కానీ ఏం లాభం దీపిక పదుకొనేకి పెళ్లైపోయింది. ఆలియా కూడా పెళ్లి చేసేసుకుంటోంది’ అన్నాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న దీపిక.. ‘త్వరలో ఆలియాకు కూడా పెళ్లి చేసుకుంటంది’ అని కన్‌ఫర్మ్ చేసేసింది.

అయితే తన అనుమతి లేకుండా దీపిక తన పెళ్లి గురించి ప్రకటించేయడంతో ఆలియాకు కాస్త కోపం వచ్చింది. ‘ఎక్స్‌క్యూజ్‌మీ.. నా అనుమతి లేకుండా పెళ్లి గురించి ఎలా డిక్లేర్ చేసేస్తారు?’ అని దీపికపై మండిపడింది. అప్పుడు దీపిక తనని తాను సమర్ధించుకుంటూ.. ‘గయ్స్.. విజయ్ దేవరకొండ రియాక్షన్ ఏంటో చూద్దామని అలా చెప్పాను’ అన్నారు.

రణ్‌బీర్ సింగ్‌కి గతంలో కత్రినా కైఫ్, దీపిక పదుకొనేతో ఎఫైర్స్ ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. రణ్‌బీర్‌తో విడిపోయాక వారెంతో నరకం అనుభవించారో పరోక్షంగా చాలా సార్లు వెల్లడించారు. కానీ విడిపోవడమే మంచిదైందని కత్రినా ఓసారి తెలిపారు. అన్నీ తెలిసిన ఆలియా తనకంటే పదేళ్లు పెద్దవాడైన రణ్‌బీర్‌తో ప్రేమలో ఎలా పడిందో ఆమెకే తెలియాలి అంటూ కొంద‌రు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.