రాశిఫ‌లాలు
మేషం – గృహ నిర్మాణాలు సకాలంలో పూర్తికావు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధనాన్ని అధికంగా వెచ్చిస్తారు. వృత్తి, ఉద్యోగరీత్యా నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ప్రేమికులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహిస్తారు.
 
వృషభం -ఆర్థిక స్థితిలో కొంత పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఆశాజనకం. ఆహార వ్యవహారాలలో ఏకాగ్రత వహిచండి. పత్రిక, మీడియా రంగాలలో వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ఆఖస్మిక ఖర్చులు, చెల్లింపుల వల్ల ఒడిదుడుకులు తప్పవు.
 
మిథునం -ఆదాయ వ్యయాలు సంతృప్తిగా సాగుతాయి. తలపెట్టిన పనులు ఏమాత్రం ముందుకు సాగవు. ఉత్సాహంగా మీ యత్నాలు కొనసాగించండి, సత్ఫలితాలు లభిస్తాయి. కుటుంబీకుల ధోరణి చికాకు పరుస్తుంది. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. వ్యాపారాభివృద్ధికి బాగా శ్రమిస్తారు.
 
కర్కాటకం -సాంఘిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వైద్య రంగాలలో వారికి అనుకూలత. ప్రేమికులకు పెద్దలకు మధ్య సంస్యలు తలెత్తుతాయి. రావలసిన ధనం సకాలంలో అందుట వలన ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. పండ్లు, పూల వ్యాపారాలకు లాభదాయకంగా ఉంటుంది.
 
సింహం- దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు పనిలో ఒత్తిడి వల్ల ఆరోగ్యంలో చికాకులు తప్పవు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి ఒత్తిడి చికాకులు తప్పవు. వాహనం ప్రయాణాలలో నూతన పరిచయాలు విస్తరిస్తాయి.
 
కన్య -ఉద్యోగస్తులకు తోటి వారి సహకారం, అండదండలు లభిస్తాయి. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. ముఖ్యులను కలుసుకున్న కార్యం నెరవేరదు. స్త్రీలకు పనిభారం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. బంగారం, వెండి, వస్త్ర రంగాలలో వారికి ఆశాజనకం. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు.
 
తుల- రాజకీయాలలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. స్త్రీలు తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. గృహంలోమార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వ్యాపారస్తులకు జాగ్రత్త అవసరం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలలో వారికి సామాన్యం.
 
వృశ్చికం – బంధువుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంబాషించునపుడు ఎదుటివారిని గమనించి మెలగండి. అవకాశవాదులు అధికం అగుట వలన రాజకీయాలలో వారు మాటపడతారు. పీచు, ఫోము, లెదర్, వ్యాపారస్తులకు సంతృప్తి, అభివృద్ధి కానవస్తుంది.
 
ధనస్సు -మీ మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. వాహన, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక వాయిదా పడుతుంది. స్త్రీలకు ప్రకటనలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. కోర్టు వ్యవహారాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
మకరం -వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు లాభసాటిగా సాగుతాయి. గృహ మరమత్తులలో వ్యం మీ అంచనాలను మించుతుంది. పత్రికా సంస్థలలోని ఉద్యోగస్తులకు ఒత్తిడి. చికాకులు అధికం. ప్రయాణాలు ఆశించినంత ఉత్సాహంగా సాగవు. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు.

కుంభం- ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్ధంగా నిర్వహిస్తారు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగస్తుల సమర్ధతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. విదేశీయానం కోసం యత్నాల్లో సఫలీకృతులవుతారు. నిరుద్యోగులు, వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
మీనం -సన్నిహితుల కోసం ధనం బాగా వెచ్చిస్తారు. భార్య భర్తల మధ్య కొన్ని సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్సలను విజయంవంతంగా పూర్తి చేస్తారు. రవాణ, ఎగుమతులు, ఆటోమొబైల్ రంగాల వారికి పురోభివృద్ధి.

Leave a Reply

Your email address will not be published.