అల్యూమినియం ఫ్యాక్టరీలో పవన్ కళ్యాణ్ షూటింగ్ ప్రారంభం

పవన్ కళ్యాణ్ – క్రిష్ జగర్లమూడి కాంబ‌నేష‌న్‌లో రాబోతున్న చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సంబంధంలేని “ప్రధాన సన్నివేశాలు” చిత్రీకరించడం ఆరంభించిన‌ట్టు చిత్ర‌వ‌ర్గాలు చెపుతున్నాయి. ఈ షెడ్యూల్‌లో తన భాగాల కోసం పవర్ స్టార్ రెండు మూడు రోజుల‌లో పాల్గొంటార‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే ఈ సినిమాలో ప‌వ‌న్ రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర పోషిస్తున్న‌ట్టు స‌మాచారం అందుతోంది. ఇందుకోసం ఆయ‌న త‌న గెట‌ప్‌ని పూర్తిగా మార్చేసి ఓ కొత్త లుక్ తో ఈ మ‌ధ్య క‌నిపిస్తున్నారు. అది ఈ సినిమా కోసం ఉద్దేశించబడిందేన‌ని తెలుస్తోంది.

గ‌తంలో క్రిష్ తో కలిసి స‌కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి- ‘ఎన్టీఆర్’ సినిమాలకు పనిచేసిన సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తుండ‌గా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సాయి బాబా కెమెరాను క్రాంక్ చేస్తున్న ఈ సినిమాని గ‌తంలో భార‌తీయుడు లాంటి సూప‌ర్ హిట్ల‌ని అందించిన ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.