ఇన్సైడ్ ట్రేడింగ్ గాళ్లని అరెస్టు చేయండి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని పదే పదే చెపుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షన విచారణ జరిపి భూములు కొన్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోరని సినీ హీరో శివాజీ మండి పడ్డారు. అమరావతి ఓ కులానికి చెందినదంటూ వైసిపి తప్పు పడుతోందని, నిజంగా చంద్రబాబుకు కుల పిచ్చి ఉంటే కమ్మవాళ్లున్న చోటే కియా మోటార్స్ పెట్టకుండా రెడ్డిలు ఎక్కువగా ఉండే అనంతపురంలో ఎందుకు పెట్టారో వైసిపి నేతలు చెప్పాలని నిలదీసారు. ఎన్నికల్లో పెట్టిన డబ్బుకు నాలుగింతలు సంపాదించుకునేలా చేస్తానన్న జగన్ తను పార్టీ నేతలకు ఇచ్చిన హామీ మేరకే రాజధాని మార్పు చేస్తున్నారని శివాజీ ఆరోపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే టీడీపీ నేతలను జైలులో పెట్టేందుకు ఎవ్వరికీ అభ్యంతరం ఉండదని, వ్యాఖ్యానించిన శివాజీ 5 కోట్ల ప్రజలకు చెందిన రాజధాని అమరావతి గా అంతా గుర్తించారని, ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల రైతులు 33 వేల ఎకరాల భూములిచ్చారని , ప్రధాని శంఖుస్థాపన చేసిన రాజధాని కోసం ఇప్పటికే రూ.10వేల కోట్లు ఖర్చు పెట్టాక సొంత ప్రయోజనాలకోసమే రాజధాని మార్పుకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేసారు శివాజీ.