నాలో హాట్ నెస్ ఉంది న‌న్ను ఉప‌యోగించుకోండి


‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. బేసిగ్గా తెలుగమ్మాయి కావడంతో ఈ భామకు మన దగ్గర అంత ఆదరణ రాలేదు. ఆ తర్వాత ‘బందిపోటు’, ‘అమీ తుమీ’, వంటి సినిమాల్లో నటించిన సరైన బ్రేక్ రాలేదు. ఇక నాని నిర్మాణంలో తెరకెక్కిన ‘అ’ మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. గతేడాది త్రివిక్రమ్-ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటించింది. ఇక ఇప్పుడు డోస్ కాస్త పెంచి హాట్ ఫోటోస్‌లో అందాల ప్రదర్శన చేస్తుంది ఈషా రెబ్బా.

సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం “రాగల 24 గంటల్లో”. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్ పై ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నవ నిర్మాత శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా నవంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సంధర్భంగా ఈషా రెబ్బ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం.

ఈ చిత్రం ఒప్పుకోవడానికి గల కారణం  ?

ఈ చిత్రంలో నాది ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో పాటు, కథ మొత్తం నా పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ రోజులలో ఇలాంటి పాత్రలు దొరకడం చాలా అరుదు. అందుకే వెంటనే ఒకే చెప్పాను.

 తెలుగు అమ్మాయిగా ఉండటం నష్టమా?

తెలుగు అమ్మాయిగా ఉండటం వలన అవకాశాలు రావు అని నేను అనుకోవడం లేదు. తెలుగు అమ్మాయిలు కూడా అన్ని రకాల పాత్రలలో అద్భుతంగా నటించగలరు అని నిరూపించాలని, నేను గట్టిగా ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతం పరిశ్రమలో చాలా మంది తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు.

మీకు, హీరో సత్యదేవ్ కి మధ్య గొడవలు ఉన్నాయట కదా?

అందులో ఎంతమాత్రం నిజం లేదు. మా ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఆయన తన వెబ్ సిరీస్ పనులలో బిజీగా ఉండటం వలన ఈ మూవీ ప్రమోషన్స్ లో అంతగా పాల్గొనలేక పోతున్నారు. ఈ మూవీలో మేమిద్దరం మంచి రోల్స్ చేశాం. సినిమా చూశాక మీకే ఆ విషయం అర్థం అవుతుంది.

ఈ మధ్య మీరు గ్లామర్ డోస్ పెంచినట్లు ఉన్నారు. ఎక్కువుగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోస్ ఫోస్ట్ చేస్తున్నారు ?

నాలో హాట్‌నెస్‌ ఉంది కదా… అందుకే పోస్ట్ చేస్తున్నాను. అయినా దానిలో తప్పేం ఉంది. నిజానికి మన ఫిల్మ్ మేకర్స్‌ నన్ను ఒకేరకమైన పాత్రల్లో చూపిస్తున్నారు. నేను కూడా గ్లామర్ పాత్రలకు సూట్ అవుతానని చెప్పడానికే సోషల్ మీడియాలో అలా కొన్ని ఫోటోస్ పోస్ట్ చేశాను.

తెలుగు అమ్మాయి అనే పాత్ర‌తోనే మీకు ఎక్కువుగా స్టీరియోటైప్‌ పాత్రలు ఇస్తున్నారా ?

తెలుగమ్మాయిని కాబట్టి స్టీరియోటైప్‌ పాత్రలకు అలాగే ఎక్కువగా విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌, ట్రెడిషనల్‌ పాత్రలకే నన్ను పరిమితం చేస్తున్నారు. కానీ ఇప్పుడు మేకర్స్ లో కూడా మార్పు వస్తోంది. ఇషా అన్ని రకాల పాత్రలు చేయగలదని వాళ్లకు నమ్మకం కుదురుతుంది. అలా అంటే వేరే ట్రెడిష‌న్ నుంచి వ‌చ్చిన వాళ్ళు మ‌న డ్ర‌సెస్ వేసుకుని చెయ్య‌డంలేదా ఇదీ అంతే.

లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తెలుగు వర్షన్ లో మీరు నటిస్తున్నారు ?

అవును. హిందీలో తెరకెక్కిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ బాగా హిట్ అయింది. అక్కడ ప్రేక్షుకులకు బాగా కనెక్ట్ అయిన సిరీస్ అది. ఇప్పటికే దర్శకుడు సంకల్ప్ రెడ్డి రెండు ఎపిసోడ్స్ ను తెరకెక్కించారు. ఆ ఎపిసోడ్స్ లో నాతో పాటు సత్య దేవ్, అవసరాల శ్రీనివాస్ కూడా నటించారు.

ఈ సిరీస్ లో కియారా అద్వానీ చేసిన రోల్ ను మీరు చేస్తున్నారా ?

ఈ సిరీస్ కి సంబంధించి అందరూ నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. కానీ అదేం లేదు. నా పాత్ర కొత్తగా ఉంటుంది. మార్చిలో మా వెబ్ సిరీస్ ను రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అప్పుడే మీకే తెలుస్తోంది. అలాగే మిగతా ఎపిసోడ్స్ ను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారనే అనే విషయం కూడా నాకు తెలియదు.

మీ తదుపరి సినిమాల గురించి ?

ప్రస్తుతం ‘రాగల 24 గంటల్లో’ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. ఇక ఇతర సినిమాల విషయానికి వస్తే… తమిళంలో జీవీ ప్రకాష్ తో ఓ సినిమా చేశాను.. అలాగే కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ సినిమాలో నటించబోతున్నాను.

Leave a Reply

Your email address will not be published.