రాశిఫ‌లాలు

మేషం – ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా సంతృప్తికానరాదు. రాజకీయాల్లో వారికి తోలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏదైనా అమ్మే ఆలోచన వాయిదా వేయటం మంచిది. ప్రయత్నపూర్వకంగా బాకీలు వసూలు కాగలవు. దైవ దర్శనాలలో పాల్గొంటారు.

వృషభం- కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు ఒడిదుడుకులు తప్పవు. ఫ్యాన్సీ, సుగంధద్రవ్య, రసాయన వ్యాపారస్తులకు లాభదాయకం, నిరుద్యోగులు భవిష్యత్ గురించి వేసిన పథకాలు సత్ఫలితాలనిస్తాయి. మీ సంతానం కోసం ధనం ఖర్చు చేస్తారు. ఉపాధ్యాయులు ఒత్తిడి సమస్యలకు లోనవుతారు.
మిథునం -ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతంది. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. పత్తి, పొగాకు రంగంలోని వారికి అనుకాలమైన కాలం. రచయితలకు, పత్రికా రంగంలోని వారికి శుభదాయకం. బిల్లులు చెల్లిస్తారు.
కర్కాటకం – ఉమ్మడి వ్యాపారాలు, తీసుకున్న ఏజెన్సీలు, లీజువు నిదానంగా సత్ఫలితాలనిస్తాయి. స్త్రీల సృజనాత్మకతకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మిత్రుల కారణంగా మీ పనులు వాయిదా వేసుకుంటారు. పారిశ్రామిక రంగం వారికి అనువైన పరిస్థితులు ఏర్పడగలవు. నూతన బంధుత్వాలు ఏర్పడతాయి.

 సింహం – దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటచారు. ఒక కార్యం నిమిత్తం ప్రయాణం చేయవలసి వస్తుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు, సంస్థలకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోగలవు. ఉన్నత విద్య, ఉద్యోగం వంటి లాభాలున్నాయి. మీరు చేయు యత్నాలకు సన్నిహితులు తోడ్పడుతారు.
కన్య – ఊహించని ఖర్చులు అధికం కావడంతో స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. వాహన సౌఖ్యం పొందుతారు. ఆరోగ్య, ఆహార విషయాలలో మెళకువ అవసరం. లౌక్యంగా వ్యవహరించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.
తుల – వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారులకు పనివారలతో చికాలు ఎదుర్కోవలసి వస్తుంది. భార్య, భర్తల మధ్య కొన్ని సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. చిన్నతరహా పరిశ్రమలు, వృత్తుల వారికి కలిసి రాగలదు. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో సదవకాశాలు లభిస్తాయి.
వృశ్చికం – రియల్ ఎస్టేట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు. సన్నిహితులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. కుటుంబలో మానసిక ప్రశాంతత నెలకొంటుంది.
ధనస్సు – ప్రైవేటు సంస్థలోని వారు మార్పుకై చేయు యత్నాలకు ఆటంకాలు తప్పవు. స్త్రీలు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ఖర్చులు అధికం కావడంతో రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. వాహన చోదకులకు చికాకులు తప్పవు. వృత్తుల వారికి సామాన్యం.
మకరం- ఆర్థికంగా ఎదగటానికి మీరు చేయు యత్నాలు ఒక కొలిక్కిరాగలవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. ఉద్యోగస్తులు బరువు, బాధ్యతలు అధికమవుతాయి. గృహమునకు కావలసిన విలువైన వస్తువులను అమర్చుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
కుంభం -భాగస్వామిక వ్యాపారాల్లో కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కొంత మంది మీ నుంచి ధనసహాయం ఆర్జించవచ్చు. జాగ్రత్త వహించిండి. స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. మీ శ్రీమతి సలహా పాటించి ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు.
రాశిచక్ర అంచనాలు
మీనం – కోర్టు వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. సమయానికి ధనం అందకపోవడంతో ఒడిదుడుకులు, ఆందోళనలు ఎదుర్కుంటారు. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. క్యాటిరింగ్ రంగాల వారికి శుభదాయకంగా ఉంటుంది. బంధువులతో మీ సత్సంబంధాలు మెరుగుపడతాయి.

Leave a Reply

Your email address will not be published.