మరో రావణాసురుడు?

రామ్ చరణ్ – రామారావు- రాజమౌళి కాంబినేషన్ సినిమా ఆర్.ఆర్.ఆర్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. స్వాతంత్య్ర కాలంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్, ఎన్టీఆర్ దొంగా పోలీస్ పాత్రల్లో నటిస్తున్నారని ఇప్పటికే ప్రచారం ఉంది. ఇప్పటివరకూ కథానాయికల్ని ఎంపిక చేయలేదు. చరణ్, ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ సాగుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో చరణ్, ఎన్టీఆర్ లుక్ పైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఆ ఇద్దరూ మునుపటితో పోలిస్తే గెటప్పుల పరంగా, రూపురేఖల పరంగా వైవిధ్యంగా కనిపిస్తారని, ఆ మేరకు ట్రైనింగ్ తీసుకుంటున్నారని ప్రచారమైంది. తాజాగా ఎన్టీఆర్ కొత్త లుక్ కి సంబంధించిన ఫోటో ఒకటి అంతర్జాలంలో వైరల్ అవుతోంది. తారక్ మునుపటితో పోలిస్తే పూర్తి విభిన్నమైన గెటప్ లో కనిపించనున్నాడని అర్థమవుతోంది. కాస్త రఫ్ గా జై లవకుశలో రావణ తరహాలో కాస్తంత భీకరంగానే కనిపిస్తాడని అర్థమవుతోంది. తారక్ ఇప్పటికే వ్యక్తిగత శిక్షకుడు లాయ్డ్ స్టీఫెన్స్ సమక్షంలో జిమ్ లో భారీగా కసరత్తులు చేస్తున్నాడు. తారక్ లో ఛేంజోవర్ కనిపిస్తోందిట. ఎవ్వర్ లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం.. తారక్ ప్రస్తుతం ఓ షార్ట్ ట్రిప్ లో ఉన్నాడు. భార్య ప్రణతి, పిల్లలు సహా దుబాయ్ వెళ్లారని తెలుస్తోంది. వచ్చే వారం తిరిగి వెనక్కి వస్తారు. రాగానే ఆర్.ఆర్ఆర్ షూటింగ్ కి తారక్ ఎటెండ్ కానున్నారని తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీలో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 2020లో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ చిత్రీకరణ సాగుతున్న సంగతి తెలిసిందే.