అభిరామ్‌ దర్శకత్వంలో పవన్‌ తేజ్‌ కొణిదెల

మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌ పై అభిరామ్‌ ఎం. దర్శకత్వంలో పవన్‌ తేజ్‌ కొణిదెల హీరోగా  రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ మువీ ‘ఈ కథలో పాత్రలు కల్పితం’.  మేఘన, ల‌క్కి క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్ర   ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్ప‌టికే విడుద‌లై సంచ‌ల‌నం సృష్టిస్తోంది.  తాజాగా ఈ చిత్రం నుండి నటుడు పృద్విరాజ్ లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది…   

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ…  ఈ కథలో పాత్రలు కల్పితం త‌న‌ మొదటి సినిమా అయినా మా హీరో పవన్‌ తేజ్‌ కొణిదెల అనుభ‌వం ఉన్న న‌టుడిగా బాగా చేసాడు.  ఈ మూవీలో సీనియ‌ర్‌ నటుడు పృద్వి రాజ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.  పోలీస్ అధికారిగా ఈ సినిమాలో ఆయ‌న క‌నిపించ‌నున్నాడ‌ని చెప్పారు.  హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంద‌ని,  త్వ‌ర‌లో చిత్ర నిర్మాణంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి  త్వ‌ర‌లో విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పారాయ‌న‌.

Leave a Reply

Your email address will not be published.