విమానం మోతే!

అందం చందం అభినయం అన్నిటి కలబోత ప్రగ్య జైశ్వాల్. ముంబై నుంచి వచ్చిన ఈ అమ్మడు ట్రెడిషనల్ తెలుగమ్మాయిలా ఎంతో నేచురల్ బ్యూటీతో కుర్రకారుపై మత్తు చల్లింది. కంచె సినిమాతో గుండెల్లో కంచె వేసింది. సహజసిద్ధతతో పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూనే సందర్భ ం వస్తే తనలోని వాడి వేడి చూపించేందుకు ఏమాత్రం భేషజానికి పోదని ‘ఆచారి అమెరికా యాత్ర’ లాంటి చిత్రంలో చూపించింది. ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ప్రగ్య పాత్ర ఎలాంటిది? అన్నది తెలియాల్సి ఉంది. ప్రగ్య జైశ్వాల్ కెరీర్ పరంగా వెనకబడినా నిరంతరం సామాజిక మాధ్యమాల్లో మాత్రం వేడి పెంచుతూనే ఉంది. అక్కడ లేటెస్ట్ ఫోటోషూట్లతో టచ్ లో ఉంటోంది. తాజాగా రివీల్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ జోరుగా వైరల్ అవుతోంది. సింపుల్ గా చీరలో మత్తందాన్ని యువతరంపై చల్లింది ఈ అమ్మడు. ఈ ఫోటో చూడగానే బోయ్స్ .. విమానం మోతే అంటూ కామెంట్లు రువ్వుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.