సభలో నిరసన తెలిపే హక్కు లేదని ఏ చట్టం చెబుతుంది?: లోకేష్


ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మండిపడ్డారు.ప్రజా సమస్యల పై ప్రతిపక్షాలు నోరెత్తకూడదు అన్నట్టు ఉంది జగన్ గారి వ్యవహార శైలి. జగన్ గారు ప్రతిపక్షంలో ఉండగా ఎన్నోసార్లు అసెంబ్లీలో నిరసన తెలిపారు. అప్పట్లో వారికి ఉన్న హక్కు, ఇప్పటి ప్రతిపక్షమైన టీడీపీకి ఎందుకు ఉండదు? అని ప్రశ్నించారు.సభలో ప్రజా సమస్యల పై నిరసన తెలిపే మా హక్కులు హరించే అధికారం జగన్ గారికి ఎవరిచ్చారు?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు శాసనసభలో నిరసన తెలిపే హక్కు లేదని ఏ చట్టం చెబుతుందని లోకేష్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.మరో ట్వీట్ లో ఆయన పేర్కొంటూ ప్రతిపక్ష సభ్యులను అగౌరవపరిచే రీతిలో, చంద్రబాబుగారిని సైతం చేతులతో అడ్డుకునే అధికారం మార్షల్స్‌కు ఎవరిచ్చారు? ప్రతిపక్షనేత చేతిలో కాగితాలు ఉంటే గేటు బయటే నిలబెడతారా? అని దుయ్యబట్టారు.ప్రతిపక్షాన్ని సభల్లోకి రానివ్వకుండా చేయాలనే కుట్ర కాదా ఇది? ఏమిటీ నిరంకుశత్వం?అని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published.