తెలుగు చిత్రాల నిర్మాణం పెరగాలి, థియేటర్ల ఫీడింగ్ జరగాలి

సినిమా కష్టాలు వరుసగా వస్తూంటాయి. ఈసారి వంతు థియేటర్ల యాజమాన్యాలది ఈ సందవత్సరం ఆరంభంలోనే సంవత్సరమంతా ఎలా ఉండబోతుందో అర్ధమైపోయింది. నాలుగు పెద్ద చిత్రాలు అందులో అగ్ర నులు నటించిన చిత్రాలు కనీసం యాభై రోజులయినా నడుస్తాచపి ఆశిం,ఇప వారికి నిరాశే మిగిల్చాయి. ఎఫ్2 మాత్రమే నిలకడగా నాలుగువారాలు పూర్తి కలెక్షన్లతో నడిచింది. పెద్ద చిత్రాలు ఉన్నాయిని వెనక్కి తగ్గిన చిన్న చిత్రాలు వరుసగా విడుదలయినా ఆశించిన ఫలితాలు రాలేదు. యాత్ర చిత్రం యావరేజ్ కలెక్షన్స్‌తో నడుస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే థియేటర్ల ఫీడింగ్ కష్టం అవుతుందని థియేటర్ల యాజమాన్యాలు, లీజుదార్లు ఆందోళన చెందుతున్నారు. సంక్రాంతికి ముందు ఆ తర్వాత కూడా థియేటర్లలో సరైన సినిమాలు లేక పరిస్థితి దారుణంగా మారింది. లీజులకు తీసుకున్న వారి పరిస్థితి కూడా ఏ మాత్రం బాగోలేదని తెలుస్తోంది. థియేటర్లు కొందరు చేతుల్లో ఉన్నాయని ఇప్పటి వరకు అందరూ భావించారు. ఇప్పుడు ఆ కొందరు కూడా సెంటర్లో ఉండి కలెక్షన్లు పర్వాలేదనుకొన్నది థియేటర్లు ఉంచుకొని మిగిలిన వాటిని వదిలించుకోబోతున్నారనే వార్తలు థియేటర్ల యాజమాన్యాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నైజాంలో పరిస్థితి ఒకలా ఉంఏ ఆంధ్రాలో పరిస్థితి మరోలా ఉంది. ఆంధ్రాలో కలెక్షన్లు లేక, నూన్ షో సెకండ్ షోలను రద్దు చచేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఆంధ్రాలో అయినా తెలంగానాలో అయినా మల్టీప్లెక్స్‌లో, గ్రూప్ థియేటర్స్ పరిస్థితి పర్వాలేదని తెలుస్తోంది. థియేటర్లలో జరిగే ఇతర వ్యాపార సంస్థలు ద్వారా క్యాంటీన్లు, సైకిల్ స్టాండల వల్ల వచ్చే ఆదాయ వనరులతో వారికి పర్వాలేదని భోగట్టా. నైజాంలో సర్కార్ పార్కింగ్ ఫీజు వసూలు చేసుకొనే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్చిలో థియేటర్లవారు సమ్మె చేయాలనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. విద్యార్ధులకు పరీక్షలు జరిగే మార్చి చివరి వారం నుండి ఏప్రిల్ చివరి వారం వరకు కలెక్షన్లు ఎలాగూ తగ్గుతాయి వేసవిలో విడుదల కాబోయే పెద్ద బడ్జెట్ చిత్రాలతో థియేటర్లు కళకళలాడతాయని ఆశ. సంక్రాంతి సీజన్ లాగే వేసవి సీజన్ కూడా నిరాశపరిస్థితే థియేటర్ల మనుగడ దెబ్బతినడం ఖాయం. అందుకే కొందరు థియేటర్ యజమానులు వాటింటిరీగా కొన్నాళ్ల తమంతటతామే మూసి వేసుకోవాలనే ఆలోచన చేస్తున్నారని వినికిడి. ఈ ప్రమాదాన్ని తక్షణ నివారించాల్సిన బాధ్యత చిత్ర నిర్మాణాలు చేపటటే దర్శక నిర్మాతల మీద ఉంది. ప్రేక్షకులు అభిరుచి మారింది. కంటెంట్ ప్రధానంగా ఉన్న చిత్రాలు చేస్తున్నారు. మల్టిపుల్ కాంబినేషన్స్ ఉన్న చిత్రాలు చేస్తున్నారు. కొత్తదనంతో కూడిన థ్రిల్లింగ్ పాయింట్‌తో వచ్చే చిత్రాలు చేస్తున్నారు. జనంకు నచ్చే వారు మెచ్చే చిత్రాలు నిర్మించేందుకు నిర్మాత, దర్శకులు ప్రయత్నించాలి. కొత్త ఆలోచనలతో కొంగ్రొత్తరీతిలో ఎక్కువ చిత్రాల నిర్మాణానికి అందరూ తోడ్పడాలి. రిలీజ్ కావాల్సిన చిత్రాల అడ్డంకులు తొలగిపోవాలి అగ్ర మీరోలతంతా సొంత నిర్మాణసంస్థలైనా, బయట నిర్మాతలకైనా ఎక్కువ సినిమాలు చేయాలి. అప్పుడే థియేటర్ల ఫీడింగ్ సమస్య తీరుతోంది.