నితిన్ నెక్స్ట్ మూవీ ‘రంగ్ దే’…తర్వాతే పెళ్లి.!

టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్లు ఎక్కువగానే ఉన్నారు. వీరిలో నితిన్ ఒకరు. నితిన్ తల్లిదండ్రలు కూడా ఆయన కోసం ఎన్నో సంబంధాలు చూశారు. అయినా అవేమీ నచ్చకపోవడంతో ఆయన ఒంటరి పక్షిగానే కొన్ని రోజుల వరకు జీవితాన్ని అలా సాగదీశాడు. కాగా నితిన్ అందరని షాక్కు గురి చేశారు. ఇటీవల నిఖిల్ తన లవర్ని వివాహమాడుతున్నట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరచాడు.
గత నాలుగేళ్లుగా షాలిని అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న నితిన్ ఏప్రిల్లో దుబాయ్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నాడని పుకార్లు వినిపించాయి. కాని తాజా సమాచారం ప్రకారం పెళ్ళి మేలో చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం భీష్మ చిత్రం 21న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు నితిన్. ఈ సినిమా తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా చేయనున్నాడు. చంద్రశేఖర్ ఏలేటి, దర్శకుడిగా మారిన లిరిసిస్ట్ కృష్ణ చైతన్యల దర్శకత్వంలోను పలు సినిమాలు చేసేందుకు నితిన్ ప్లాన్ చేస్తున్నాడు. ఈసినిమాలు పట్టాలెక్కించిన తర్వాత పెళ్లి చేసుకోనున్నాడు.