పూజా పై బ‌న్నీ ఫ్యాన్స్ అస‌హ‌నం… ఎందుకంటే?

పూజా హెగ్డే, వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ భామ ఇటీవ‌లె జ‌రిగిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి ఎందువ‌ల్ల‌నో రాలేక‌పోయింది. కార‌ణాలు ఏది ఏమైన‌ప్ప‌టికీ ఒక‌ప్పుడు ఈ భామ ఏ చిత్రంలో న‌టించినా దాదాపు అన్నీ ఫ్లాప్లే అయ్యేవి అయితే గ‌తంలో బ‌న్నీతో న‌టించిన డీజె చిత్రంతో హిట్ కొట్టింది. త‌న‌కి మొద‌ట హిట్ ఇచ్చింది బ‌న్నీ. కానీ పూజా అల‌వైకుంఠ‌పురంలో ఈవెంట్‌కి రాక‌పోవ‌డంతో బ‌న్నీ ఫ్యాన్స్ కాస్త గుర్రు మంటున్నారు. ఎంత షూటింగ్ బిజీలో ఉన్నంత మాత్రాన హిట్ ఇచ్చిన హీరో సినిమా ఫంక్ష‌న్‌కే రాదా పైగా త‌ను క‌థానాయిక‌గా న‌టించిన సినిమాకి మ‌రీ ఇంత క్రేజ్ పెరిగిపోయిందా అంటూ ఫీల‌వుతున్నారు.

ఎందుకంటే ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన ఈ ఫంక్ష‌న్‌కు పూజా రాక‌పోవ‌డం కూడా ఒక‌ర‌కంగా మైన‌స్ గానే భావిస్తున్నారు  చాలా మంది.  పైగా స‌రిలేరు ఈవెంట్ అంతా అతిర‌థ మ‌హార‌థుల‌తో క‌ల‌క‌లాడింది. దీనికి కేవ‌లం అల్లు ఫ్యామిలీ బ్ర‌ద‌ర్స్ , అర‌వింద్ త‌ప్ప ఎవ్వ‌రూ రాలేదు… దీనికి తోడు పూజా హెగ్డే కూడా డుమ్మా కొట్టేసింది… దీంతో ఆమె కూడా వ‌చ్చి ఉంటే బాగుండేది క‌దా అని వాళ్లంతా గుస్సాతో ఉన్నారు. పూజా ఇలా చేయ‌డం వెన‌క కార‌ణాలు ఏమైన‌ప్ప‌టికీ ఇది స‌రైన ప‌ద్ధ‌తి మాత్రం కాదు అని ప‌లువురు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక వీళ్ళిద్ద‌రి కెమిస్ట్రీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌తంలో ఆల్రెడీ మ‌నం డీజెలో చూశాం కాబ‌ట్టి వీరి జంట సూప‌ర్ అనే చెప్పాలి.  త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం హారిక అండ్ హాసిని , గీతాఆర్ట్స్ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సునీల్ కామెడీ కూడా ఒక రేంజ్‌లో ఉండ‌బోతుంద‌ని స‌మాచారం. ఏది ఏమైన‌ప్ప‌టికీ గ‌త చిత్రం లాగే  ఈచిత్రం కూడా మంచి హిట్ కొడుతుంద‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 


Leave a Reply

Your email address will not be published.