విజయ్ ని రాజకీయంగా దెబ్బతీసేందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారా…?

గతేడాది ‘బిగిల్’ చిత్రంతో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ నటుడు విజయ్ కి ‘విజిల్’ పేరుతో తెలుగులో కూడా డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలవటంతో బాగానే కాసులు కురిసాయి. అయితే ‘బిగిల్’ సినిమా ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఇప్పటికే ఈ చిత్రం నిర్మాతల పై సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. ‘బిగిల్’ చిత్రంలో నటించినందుకు విజయ్‌కి చెల్లించిన పారితోషికానికి సంబంధించిన లెక్కలు కూడా సరిగ్గా లేవని అధికారులు గుర్తించారు. దీంతో విజయ్ ఇంట్లో నూ తనిఖీలు నిర్వహించిభారీ మొత్తంలో విజయ్ పారితోషికం తీసుకున్నా టాక్స్ సరిగ్గా చెల్లించలేదు అంటూ విచారించారు. అక్కడితో అది ముగిసింది అనుకుంటే.. ఇప్పుడు మరో షాక్ ఇచ్చారు.
మరోమారు విజయ్ ఇంట్లో గురువారం ఆకస్మిక తనిఖీలు జరిపారు తీరా చివరకు గురువారం సాయంత్రానికి మాత్రం ఐటీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేస్తూ, నటుడు విజయ్ ‘బిగిల్’, ‘మాస్టర్’ సినిమాలలో నటించేందుకు పొందిన పారితోషికానికి సంబంధించి పన్నులను సక్రమంగా చెల్లించినట్లు తెల్పడం విశేషం. దీంతో కొందరు విజయ్ ని రాజకీయంగా దెబ్బతీసేందుకు ఇలా … టార్గెట్ చేస్తున్నారా…? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ విషయం పై విజయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి…!