‘ఇస్మార్ట్‌శంకర్’ కిక్ ఇంకా నాలో ఉంది

నేటి యువతని ఆకర్షించేందుకు కావాల్సిన అందం, అభినయం రెండూ ఉన్న నటీమణి నభా నటేష్.. తెలుగుసినీ ఇండస్ట్రీకి నన్ను దోచుకుందువటే’ చిత్రంతో పరిచయమై ‘ఇస్మార్ట్ శంకర్’ తో నిజంగానే ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఇస్మార్ట్ విజయం ఆమెను అగ్రతారల వరుసలో నిలబెట్టడమే కాదు వరుస సినిమాలలో నటించే అవకాశం కూడా ఇచ్చింది. దీంతో ఇండస్ట్రీలో బిసీ అయిపోయిన నభా తాజాగా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డిస్కోరాజా’ సినిమాలో నటిస్తోంది. రామ్‌తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానున్న నేపథ్యంలో నభా నటేష్ ప్రత్యేకంగా మీడియాలతో మాట్లాడింది. ఇందుకు సంబంధించిన విశేషాలు…. ఇలా ఉన్నాయి.
డిస్కోరాజాలో మీ కేరెక్టర్ గురించి చెప్పండి.
ఇందులో నా పేరుతోనే అంటే నభ గా ఓ బ్యాంకు ఉద్యోగిగా నటిస్తున్నా. నా గత చిత్రాలకు భిన్నంగా ఈ పాత్ర ఉంటుంది. నా నిజ జీవితానికి కూడా చాలా దగ్గరగా ఉన్న ఎమోషన్స్‌కు విలువ ఇచ్చేపాత్ర పోషించడం అనందంగా ఉంది.
రవితేజతో నటించడం ఎలా ఉంది?
గతంలో రవితేజగారి ‘విక్రమార్కుడు’ చూసినప్పుడే నేను బిగ్ ఫ్యాన్‌గా మారిపోయాను. ఆ సినిమా నా ఫెవరెట్ మూవీలలో ఒకటి , రవితేజగారి ఎనర్జీ, స్క్రీన్ ప్రజెన్స్ ఒక ఎత్తయితే కామెడీ టైమింగ్ అదిరిపోతుంది. ఆయనతో వర్క్ చేస్తున్నట్టే ఉండదు. సరదాగా సందడిగా ఉంటారు. షూటింగ్ రోజులన్నీ ఎంత ఎంజాయ్ చేసానో చెప్పలేను. ఆయన సెట్స్‌లో కేవలం సినిమాలు, నటన గురించే కాదు.. మనం మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు..సమాజం, విలువలు ఇలా అనేక విషయాలపై చెప్పేవారు. అన్నీ ఆసక్తిగా ఉండేవి. ఇప్పటికిప్పుడు రవితేజగారి రోల్ గురించి చెప్పాలనుకోవడం సమంజసం కాదేమో మాస్ స్కైఫై థ్రిల్లర్‌కు రవితేజగారి ఎనర్జీ, వీఐ ఆనంద్‌గారి స్టైల్ తోడైతే ఎలా ఉంటుందో డిస్కోరాజా అలా ఉంటుందని మాత్రం చెప్పగలను.
పోనీ సినిమా గురించి చెప్పండి…
ఆనంద్‌గారు ఈ చిత్రం కోసం నాకు కథ వినిపించనప్పుడే చాలా ధ్రిల్గా ఫీలయ్యా. అందునా నా క్యారెక్టర్ మరీ ఆసక్తి కరంగా తీర్చి దిద్దారు. ఇక మేజర్‌గా రవితేజ అదరగొట్టేసారు. ఇక ‘సత్యం’ రాజేష్, నరేష్గారితో నే చేసిన సీన్లు అద్భుతంగా వచ్చాయి. ప్రేక్షకులు థ్రిల్ అయ్యే అంశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయి.
పాత్ర పరంగా మీరెలా ఫీలవుతున్నారు.
నిజమే! నిజానికి నేను థియేటర్స్ ఆర్టిస్టును, అందుకే నాలో అనేక ఊహలున్నాయి. అన్ని రకాల సినిమాలు, పాత్రలు చేయాలని ఉంది. అందుకు తగినట్టే నా కెరీర్ తొలి నాళ్ల నుంచి నటనకు ఆస్కారం ఉండి, వైవిధ్యభరిత పాత్రలు చేసే అవకాశాలు వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. డిస్కోరాజా లోని పాత్ర కూడా నాకెరీర్‌కి బాగా ఉపయోగ పడుతుందనటంలో సందేహించను.
సరే లాస్ట్ ఇయర్ మీకు ఇస్మార్ఠ్ కిక్ ఎక్కువైందటగా…
అవును `ఇస్మార్ట్‌శంకర్` కిక్ ఇంకా నాలో ఉంది. ఏపిలో, తెలంగాణాలో నేను పలు చోట్లకు తిరిగాను ఎక్కడికి వెళ్లిన ఆ సినిమాలోని పాటలు, డైలాగ్స్ వినిపిస్తున్నాయంటే ప్రేక్షకులు కూడా ఇంకా ఆ కిక్‌లోనే ఉన్నారని పించింది. ఏదైనా సరే కెరీర్ పరంగా 2019 నాకు బెస్ట్ ఇయర్ అని చెపుతా. ప్రేక్షకులు ఆదరణ తో ఈ ఏడాది కూడా బాగా ఉండాలని కోరుకుంటున్నాను.
ఇప్పుడొస్తున్న కొత్త హీరోయిన్స్ సంగతేంటి… మీకు పోటీయా?
ఇండస్ట్రీ అన్న తరువాత యంగ్ హీరోయిన్స్ మధ్య పోటీ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వస్తున్న వాళ్లంతా బెరుకు లేకుండా బాగా నటిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్‌లతో నాకు కాంబినేషన్ సీన్స్ మాత్రం ఎక్కడా లేవు కాని వాళ్లు బాగా నటించారు. నేనూ ఇంకా కష్టపడాలన్న సూచన నాకు అందించినట్టయ్యింది. అంతా నాకు మంచి మిత్రులే ఎప్పటికీ.
మరి తాజాగా సైన్ చేసిన చిత్రాలేంటి?
రవితేజ డిస్కోరాజా షూటింగ్ జరుగుతున్నప్పుడే సాయి తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో నటించేందుకు అంగీకరించా. ఇప్పుడు వీటి షూటింగ్‌లు ఆరంభమయ్యాయి. వీటితో పాటు కన్నడ, తమిళ చిత్రాల కథలు వింటున్నా. ఈ ఏడాది అక్కడా రెండు మూడు సినిమాలు చేస్తా…