దిశా నిందితులు ఎన్‌కౌంట‌ర్‌పై న‌య‌న ట్వీట్


షాద్ నగర్ దిశ అత్యాచార ఘటన నిందితులను ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపిన తీరు సంచలనం సృష్టించింది. హైదరాబాద్ పోలీసులపై దేశవ్యాప్తంగా ప్రజలు, సినీ స్టార్స్ కూడా హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఎన్‌కౌంటర్‌పై లేడి సూపర్ స్టార్ నయనతార స్పందిస్తూ, న్యాయం అనేది వేడిగా ఉన్నప్పుడే వడ్డించాలి అంటూ తనదైన శైలిలో నయన్ ట్వీట్టర్ ఓ లేట‌ర్ రిలీజ్  చేసింది.ఈ డేట్ ని దేశంలోని ఆడవాళ్ళందరూ క్యాలెండర్‌లో మార్క్ చేసి పెట్టుకోవాలని, ఘటన జరిగిన తర్వాత సరైన న్యాయం చేసిన పోలీసులకు తెలంగాణ గవర్నమెంట్‌కు కృతజ్ఞతలు తెలిపింది.
చిన్నప్పటి నుంచే పిల్లలకు సత్ప్రవర్తన నేర్పించాలని.. ముఖ్యంగా అబ్బాయిలకు బయట సొసైటీలో ఎలా మెలగాలనే విషయంపై బుద్ధులు నేర్పించాల్సిందేనని, ఎవరైతే అమ్మాయిలను గౌరవంగా, క్షేమంగా చూసుకుంటారో వాళ్లే అసలైన హీరో అంటూ పిల్లలకు అర్థమయ్యేలా తల్లిదండ్రులు చెప్పాల్సిన బాధ్యత ఉంది అని నయన్ రాసుకొచ్చింది. నయన్ రాసిన ఈ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published.