గణ తంత్ర దినోత్సవ సందర్భంగా పోలీసు సేవా పురస్కారాలు….గణ తంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన‌ రాష్ట్రపతి శౌర్య, విశిష్ట సేవా పురస్కారాలను ల‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజిలెన్స్‌ డీజీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, విజయవాడ ఏసీపీ సుధాకర్ ల‌ను రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పురస్కారాలు వరించాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 27 మంది అధికారులకు ఉత్తమ పోలీసు ప్రతిభా పురస్కారాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 15 మంది, తెలంగాణ నుంచి 12 మంది అధికారులు వీటికి ఎంపికయ్యారు. ఇందుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపికైన అధికారుల వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

* విజయవాడ ఏఎస్పీ అమర్లపూడి జోషి
* ఏపీఎస్పీ మంగళగిరి బెటాలియన్‌ అడిషనల్‌ కమాండెంట్‌ చింతలపూడి రామకృష్ణ
* విజయవాడ సీఐడీ డీఎస్పీ ఎం. భాస్కరరావు
* విశాఖపట్నం గ్రేహౌండ్స్‌ అసాల్ట్ కమాండర్‌ జి. విజయ్‌కుమార్‌
* విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ రిజర్వ్‌ ఇన్స్‌పెక్టర్‌ కె.జోన్‌ మోసెస్‌ చిరంజీవి
* నెల్లూరు ఏఆర్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎన్‌.గౌరి శంకరుడు
* అనకాపల్లి ఏఎస్‌ఐ పి. విక్టోరియా రాణి
* చిత్తూరు ఏఎస్‌ఐ కేఎన్‌ కేశవన్‌
* అనంతపురం ఏఆర్‌ ఎస్‌ఐ ఎస్‌. రామచంద్రయ్య
* ఒంగోలు సీసీఎస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎల్లిశెట్టి చంద్రశేఖర్‌
* విజయవాడ ఎస్‌ఐబీ హెడ్‌ కానిస్టేబుల్‌ పులిమద్ది విజయభాస్కర్‌
* విజయనగరం ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ నలడింపల్లి రామకృష్ణ
* కర్నూలు కానిస్టేబుల్‌ గద్వాల రామన్న
* విశాఖపట్నం రైల్వే కానిస్టేబుల్‌ సూర్యనారాయణ
* విశాఖపట్నం ఏఆర్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణ


Leave a Reply

Your email address will not be published.