పెళ్లి తర్వాత వరుస విజయాలు సాధించిన సమంత

టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత అక్కినేని ఈ మధ్య ఏ సినిమా చేసినా విజయవంతమవుతుంది. పెళ్లయిన తర్వాత కథానాయికలకు ప్రాధాన్యం తగ్గుతుంటుంది. కాని ఆమె విషయంలో ఇది నిజం కాలేదు. సమంత పెళ్లయిన తర్వాత కూడా విజయలతో దూసుకెళ్తుంది. మరిన్నీ అవకాశాలు ఆమెను వెతుకుంటూ వస్తున్నాయి.
సామ్ జాను సినిమాతో మరోసారి తనకు నటనలో ఎవరు పోటీరారని నిరూపించింది. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా సమంతకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంలో సమంత కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. ఈ చిత్రంలో రామ్‌చరణ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుండగా, ఆయన సరసన సమంతని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్‌తో కలిసి సమంతా ఈచిత్రంలో దాదాపు 40 నిమిషాల పాటు కనిపించనుందట. సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిరు 152వ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. స్టాలిన్ సినిమా తర్వాత త్రిష మెగాస్టార్‌తో ఆడిపాడనుంది.