‘బ్యూటీఫుల్‌ ఇన్‌సైడ్‌ అండ్‌ అవుట్‌సైడ్‌’
నేటి స్మార్ట్ ప్రపంచంలో టిక్‌టాక్, సెల్ఫీలకు చాలా మంది జనాలు బానిసలుగా మారుతున్నారు. ఈ పిచ్చి కారణంగా చాలా మంది తీవ్ర ప్రమాదాల పాలై మృత్యువాత పడుతున్నా ప్రజల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. అందుకు నిదర్శనం బ్రిటన్‌లోని లింకన్‌షైర్‌కు చెందిన ప్రముఖ వర్ధమాన మోడల్ మోడలిన్‌ డేవిస్‌ అనే యువతీ  100 అడుగుల ఎత్తు నుంచి సముద్రంలో పడి మరణించడమే. వివరాల్లోకెళితే.. డేవిస్ తన మిత్రులతో కలిసి సెల్ఫీలకు ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియాలోని ‘డైమండ్‌ బే రిజర్వ్‌’ పర్వతాలపైకి వెళ్లారు. సూర్యోదయ సమయంలో ఆ పర్వత ప్రాంతం ఎంతో చూడముచ్చటగా ఉండడంతో 100 అడుగుల ఎత్తున్న పర్వత శిఖరం ఎక్కి ఆమె సెల్ఫీ తీసుకుంటుండగా, ప్రమాదవశాత్తు కాలు జారి పక్కనున్న సముద్రంలో పడిపోయి మరణించారు. ఈ ప్రమాదంపై సోమవారం సోషల్‌ మీడియాలో నివాళులు వెల్లువెత్తుతున్నాయి. డేవిస్ మరణాన్ని ఆమె కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం ధ్రువీకరించారు. దీంతో రెండు దేశాలకు చెందిన నెటిజర్లు సోషల్‌ మీడియాలో ఆమె గురించే ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. ‘బ్యూటీఫుల్‌ ఇన్‌సైడ్‌ అండ్‌ అవుట్‌సైడ్‌’ అంటూ ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.