ట‌కీమ‌ని లేపేసిన `టకీలా`


గొంతులో వెచ్చగా తాకే.. జివ్వనిపించే  ఓ గమ్మత్తైన పానీయం `టకీలా`. ఫేజ్ 3 ప్రపంచానికి పరిచయం చేయాల్సిన పనేలేని ఈ మత్తు పానీయానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతకాదు. గోవా బీచ్… సహా మెట్రో నగరాల్లో పబ్బు క్లబ్బు అన్నిచోట్లా విరివిగా లభించే పానీయమిది. ఈ పానీయం ఒక పెగ్గేస్తే ఎంతటి ఒత్తిడి అయినా మటు మాయమవుతుందని చెబుతారు.

ఇలాంటి పానీయాన్ని ఓ టీవీ కార్యక్రమం లో గుటకాయ స్వాహా చేసింది పీసీ అలియాస్ ప్రియాంక చోప్రా. మీరు రెగ్యులర్ గా పుచ్చుకునే పానీయమేది? అని హోస్ట్ తనని ప్రశ్నిస్తే.. రెడ్ వైన్ అంటూ టకీమని ఏమాత్రం తడుముకోకుండా ఒప్పేసుకున్న పీసీ – ఇండియన్ల ఫేవరెట్ పానీయం రెడ్ వైన్ అని చాలా చక్కగా చెప్పింది. వివాహానంతరం తొలి టీవీ లైవ్ షోలో పీసీ ఎంతో ఫన్ ని క్రియేట్ చేసింది. అమెరికన్ పాప్ సింగర్ యాక్టర్ – లిరిక్ రైటర్ నిక్ జోనాస్ తో ఏడాది పాటు సాగించిన దాగుడుమూతల ప్రేమాయణానికి కామా పెట్టిన బాలీవుడ్ హాటీ ప్రియాంకా చోప్రా ఇటీవల  అతడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సెలబ్రేషన్ ని పీసీ నిరంతరం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా హాలీవుడ్ టాక్ షో `ఎలెన్ డిజేనర్స్ షో`లో ప్రత్యక్షమై పెద్ద సర్ ప్రైజ్ నే ఇచ్చింది. పీసీ ఇప్పటికే పలు టీవీ షోల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఓవైపు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూనే – మరోవైపు ప్రఖ్యాత టీవీ చానెళ్ల లైవ్ ఇంటర్వ్యూల్లోనూ ప్రచారం చేసుకుంటోంది.  హాలీవుడ్ లో రెండేళ్లుగా సాగిస్తున్న పయనంపైనా – వ్యక్తిగత జీవితంపైనా పీసీ ఈ కార్యక్రమంలో ముచ్చటించింది. ఈ షోను హెడిల్ టన్ ప్లానెట్ లో చిత్రీకరించారు. జనవరి 30న వరల్డ్ వైడ్ పూర్తి షోని టెలికాస్ట్ చేయనున్నారని తెలుస్తోంది. పీసీ నటించిన ఏ కిడ్ లైక్ జేక్ చిత్రం 2019 జూన్ లో రిలీజ్ కి రానుంది.

Leave a Reply

Your email address will not be published.