భూములు కాజేసే ప్ర‌య‌త్నం జరుగుతుంది. న్యాయపోరాటం చేస్తా..మాన్సాస్‌ ట్రస్టుపై ప్రభుత్వ పెత్తనం చేయాల‌ని భావించి  చీకటి జీవోలతో  హ‌స్త‌గ‌తం చేసుకునేలా వ్య‌వ‌హ‌రించింద‌ని   కేంద్ర మాజీమంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు పూసపాటి అశోక్‌ గజపతిరాజు తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డ్డారు.   విజయనగరంలోని అశోక్‌ బంగ్లాలో  ఆయన మీడియాతో మాట్లాడుతూ…మా తండ్రి పీవీజీ రాజు స్థాపించిన మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌(మాన్సా్‌స)  బాడీని మార్చాల‌ని ప్ర‌భుత్వం త‌న‌కి  కనీసం నోటీసు ఇవ్వాల్సిన బాధ్య‌త లేదా? అని ప్ర‌శ్నించారు. ట్ర‌స్టుకు చైర్మన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాపై ఇందులో అవినీతి, అక్రమాలకు పాల్పడిన‌ట్టు ఆరోపిస్తున్నారు. మ‌రి దర్యాప్తు చేసేందుకు ఎందుకు వెన‌క్కి త‌గ్గుతున్నార‌ని నిల‌దీసారు.  సింహాచలం దేవస్థానంలో అనువంశిక ధర్మకర్తగా ఉన్న నాకు సమాచారం, నోటీసు లేకుండా ఏవిధంగా కొత్త పాలకవర్గాన్ని ఎలా నియ‌మిస్తార‌ని, పురుషులనే చైర్మన్‌గా గుర్తించాలని ట్రస్టు బైలాలోనే స్పష్టంగా ఉంది. చట్టప్రకారం రిజిస్టర్‌ అయిన దానికే విలువలేకుండా చేయటం దారుణం’’ అంటూ అశోక్‌ మండిపడ్డారు. బైలాలో రొటేషన్‌ పదమే లేకపోయినా, ఆ విధానంలో పదవులు కట్టబెడుతున్నట్లు పేర్కొనడం అన్యాయమన్నారు. 
అన్య మ‌త‌స్తుల‌ను   ట్రస్టు చైర్మన్‌గా నియ‌మించార‌ని,  సంచయిత ఆధార్‌ కార్డును పరిశీలించాల‌ని ఆయ‌న డిమాండ్ చేసారు.  ఆరోగ్య తనిఖీ కోసం ఢిల్లీకి వెళ్లిన విష‌యం తెలుసుకుని రాత్రికి రాత్రి చీకటి జీవో తెచ్చి ఉద‌యానికే సంచ‌యిత‌ని ర‌ప్పించి హ‌డావిడిగా ప్ర‌మాణ స్వీకారం చేయించార‌ని,  కొన్ని శ‌క్తులు స్వార్ధంతో వ్య‌వ‌హ‌రించాయ‌ని    సింహాచల దేవస్థానం పరిధిలో 108ఆలయాలు, విలువైన భూములు ఉన్నాయి. భూములు కాజేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని   దీనిపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్టు తేల్చి చెప్పారాయ‌న‌.  

Leave a Reply

Your email address will not be published.