ఎవ్వ‌రిని విడిచిపెట్ట‌నంటున్న రామ్‌గోపాల్‌వ‌ర్మ‌…?


అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌బిడ్డ‌లు రామ్ గోపాల్ వర్మ తాజా వివాదాస్పద సినిమా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ ఎన్నిఅడ్డంకులు వచ్చిన ఎట్టకేలకూ ఈ రోజు విడుదల అయింది. నిత్యం వివాదాలతో సహవాసాలు చేసి, తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరుని సంపాదించుకున్నటువంటి ప్రముఖ సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కించిన చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు… అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన చిత్రం కావడం ద్వారా ఇప్పటికే ఎన్నో వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టుముట్టాయి… ఏపీలోని అందరు రాజకీయ నాయకులతో పాటు డిల్లీ పెద్దలను కూడా ఆర్జీవీ తన చిత్రంలో వాడుకున్నాడు. అందుకనే ఈ చిత్ర విడుదలకి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వలన కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి.

కాగా ఎట్టకేలకు ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి U/A సర్టిఫికెట్ లభించింది. కాగా ఈ చిత్ర విడుదలవుతున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఒక చిన్న మీడియా సమావేశానికి హాజరైన దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ కొన్ని సంచలనమైన వాఖ్యలు చేశారు. కాగా తన సినిమాను ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి వారందరిపై త్వరలోనే కేసులు పెడతానని, వారి పేర్లను కూడా బయటపెడతానని, అంతేకాకుండా తన సినిమాను అడ్డుకునేందుకు ఎన్ని రాజకీయ కుట్రలు చేశారో అవన్నీ కూడా త్వరలోనే బయటపెడతామని ఆర్జీవీ సంచలన వాఖ్యలు చేశారు. ఇకపోతే ప్రస్తుతానికి ఆర్జీవీ మాట్లాడిన వీడియో సామాజిక మాంద్యమాల్లో వైరల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published.