కొత్త ద‌ర్శ‌కుల‌కు దూరంగా చైతు

వ‌రుస సినిమాల‌తో దూసుకు పోతున్న నాగచైత‌న్య తాజాగా మామ వెంక‌టేష్‌తో చేసిన చిత్రం వెంకీ మామ‌.13వ తేదీన ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతుండ‌గా, దీని త‌దుప‌రి దిల్ రాజు బ్యానర్ లో కొత్త ద‌ర్శ‌కుడు శశితో సినిమా ఉంటుంద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అయితే శేఖర్ కమ్ముల సినిమా క‌థ‌ ఓ కొలిక్కి రావ‌టంతా ఆ చిత్రం తెర‌కెక్కే ఆస్కారం క‌నిపిస్తోంది. దీనికి తోడు అరడజను మంది కొత్త దర్శకుల కథలు ప‌ట్టుకుని చైతుకి చెపుతున్నా అవున‌ని, కాద‌ని చెప్ప‌డంలేదు.
ఇటీవ‌ల చైతు మీడియాలో మాట్లాడుతూ ప్ర‌స్తుతానికి కొత్త దర్శకులతో సినిమా చేసే ఆలోచనలో లేని, తేల్చి చెప్పేయ‌టంతో ఆశ‌లు పెట్టుకుని క‌థ‌లు వినిపించిన కొత్త ద‌ర్శ‌కులు తెగ‌బాధ ప‌డి పోతున్నారు. ఇంత‌కీ అక్కినేని కుర్ర హీరో డెబ్యూ డైరెక్టర్ తో సినిమా చేయ‌కూడ‌ద‌ని ఎందుక‌ను కుంటున్నాడంటే నన్నో స్టార్ లా చూసి రెండో టేక్ అడగకుండానే మొదటి టేక్ నే ఫైనల్ చేసు కోవ‌టం. తీరా అది తెర‌మీద కాస్త ఇబ్బందిగా క‌నిపిస్తోంద‌ని, కొన్నాళ్లు అనుభవం ఉన్న దర్శకులతో చేయాల‌ని భావిస్తున్న‌ట్టు చెప్పుకొచ్చాడు. వాళ్ల‌యితే నన్ను రెండో టేక్ అడిగి మరీ చేయించుకుని ఆ రెండింట బెస్ట్ తీసుకుంటారని అందుకే కొన్నాళ్లు కొత్త దర్శకులను దూరం పెడుతున్న‌ట్టు చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published.