‘రూలర్’ ఫస్ట్ వీకెండ్ ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:


నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన రూలర్ సినిమాకు టాక్ తేడాగా వచ్చింది. తొలిరోజే ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా ఆశించినంతగా రావడం లేదు. ఈ చిత్రం తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.29 కోట్ల షేర్ వసూలు చేస్తే…ఫస్ట్ వీకెండ్ మొత్తం షేర్ – 6.46కోట్లు వ‌సూలు చేసింది.  బాలయ్య ఇమేజ్‌తో పోలిస్తే ఇవి తక్కువ వసూళ్లే. మాస్ సినిమా కావడంతో బి, సి సెంటర్స్‌లో రూలర్ పర్లేదనిపిస్తుంది. ఓపెనింగ్స్ వరకు బాలయ్య తన సత్తా చూపిస్తున్నాడు కానీ లాంగ్ రన్ మాత్రం కష్టమే.


నైజాం – 1.32 కోట్లు
సీడెడ్ – 1.59 కోట్లు
గుంటూరు – 1.49 కోట్లు
ఉత్తరాంధ్ర – 66 లక్షలు
తూర్పు గోదావరి – 41 లక్షలు
పశ్చిమ గోదావరి – 34.5 లక్షలు
కృష్ణా – 33 లక్షలు
నెల్లూరు – 31.5 లక్షలు


ఫస్ట్ వీకెండ్ మొత్తం షేర్ – 6.46కోట్లు


కేయస్ రవికుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంపై ముందు నుంచి కూడా అంచనాలు తక్కువగానే ఉన్నాయి. పైగా తక్కువ స్క్రీన్స్‌లో విడుదలైంది రూలర్. దాంతో కలెక్షన్ పరంగా వెనకబడిపోయాడు బాలయ్య. జై సింహ హిట్ అయినా కూడా ఈ సారి మాత్రం నిరాశ తప్పేలా లేదు. సోనాల్ చౌహాన్, వేదిక అందాల ఆరబోత కూడా రూలర్ సినిమాను కాపాడలేకపోతుంది. ఓవర్సీస్‌లో మాత్రం రూలర్ పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో మరోసారి బాలయ్య సినిమాకు భారీ నష్టాలు తప్పేలా లేవు.  సీ కళ్యాణ్ నిర్మించాడు. భూమిక, జయసుథ, ప్రకాష్ రాజ్‌, నాగినీడు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Leave a Reply

Your email address will not be published.