ముగిసిన ముఖ్యమంత్రుల సుదీర్ఘ చర్చ! ఫలితం …..

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. సిఎం కెసిఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్లో సుమారు 6 గంటలకుపైగా ఈ సమావేశం కొనసాగింది. ఈ క్రమంలో ప్రతినిధి బృందంతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మద్యాహ్న భోజనం చేశారు. భోజనం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు దాదాపు 6 గంటల పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైనా, దేశ, స్థానిక రాజకీయ పరిస్థితులపైనా చర్చించారు.
పూర్తి సహృద్భావ వాతావరణంలో, పరస్పర సహకార స్ఫూర్తితో ఈ సమావేశం జరిగింది. పలు అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ముఖ్యంగా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించే విషయంలో ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది.కేంద్ర ప్రభుత్వం పై అనుసరించాల్సిన వ్యూహం పై చర్చ జరినట్లుగా తెలిసింది సమావేశం ముగిసిన అనంతరం ఎపి సిఎం జగన్ అమరావతికి బయలుదేరారు. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక.. మూడు నెలల గ్యాప్లోనే మూడు సార్లు కేసీఆర్తో భేటీ అయ్యారు. కానీ ఈసారి మాత్రం కేవలం ఇద్దరు సీఎంలు మాత్రమే భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.