జగన్ ని ఆదర్శంగా తీసుకోనున్న రజనీకాంత్…
రాజకీయ పార్టీ స్థాపించిన తర్వాత రజనీకాంత్ పాదయాత్ర కూడా చేయబోతున్నట్లు వార్తలు షికార్లు చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసే అధికారంలోకి వచ్చారు. అదే మాదిరిగా రజనీకాంత్ కూడా పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది.

రజనీకాంత్..ఎప్పటి నుంచో ఆయన అభిమానులు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఆ దిశగా కసరత్తు కూడా చేశారని వార్తలు వినిపించాయి. 2019 ఎన్నికలకు ముందే పార్టీ స్థాపిస్తారని ఊహాగానాలు వినిపించాయి. కానీ అవేమీ జరగలేదు. ఇప్పుడు మరోసారి రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై వార్తలు ఊపందుకున్నాయి. తలైవా పార్టీ స్థాపించబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఆయన సహచర నటుడు కమల్‌హాసన్ పార్టీ స్థాపించి సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు రజనీకాంత్ వంతు వచ్చింది.  

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఏప్రిల్‌ 14 తర్వాత పార్టీని ప్రకటించనున్నట్లు సమాచారం. ఇందుకోసం రజనీ మక్కల్‌ మండ్రంగా పనిచేస్తున్న అభిమాన సంఘాలన్నింటినీ పార్టీ జిల్లా శాఖలుగా మార్చే  యత్నాలు చేసున్నారని తెలుస్తోంది. జయలలిత, కరుణానిధి మరణంతో రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ వెలితిని భర్తీ చేసేందుకు త్వరలో పార్టీ ప్రారంభిస్తానని గతేడాది ఎంజీఆర్‌ విగ్రహావిష్కరణ సభలోనూ రజనీ ప్రకటించారు.

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని రజనీ ప్రకటించారు. చెన్నైకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఎస్‌.గురుమూర్తితో సాన్నిహిత్యం నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు మొగ్గు చూపొచ్చనే వ్యాఖ్యలు వస్తున్నాయి. సీఏఏకు మద్దతుగా రజనీ మాట్లాడడం కూడా ఇందుకు బలం చేకూర్చుతోంది. అయితే, సీఏఏతో ముస్లింలకు ఏ ఇబ్బంది కలిగినా వారి కోసం పోరాడేవారిలో తానే ముందుంటాననీ ప్రకటించారు. దీంతో ఆయన రాజకీయ వ్యూహంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
 

Leave a Reply

Your email address will not be published.