జ‌బ‌ర్ద‌స్త్‌లోకి వ‌స్తున్న శ్రీ‌ముఖిబిగ్ బాస్ 3లో టాప్ 2 గా నిల‌చిన‌ యాంకర్ శ్రీముఖిని జబర్దస్త్ షోలోకి దింపుతారన్న ప్రచారం  మ‌ల్లెమాల యూనిట్‌లో తెగ జరుగుతోంది. అస‌లు బిగ్ బాస్ 3 నీర‌సంగా ఉన్న‌ప్పుడు ఆ ఇంట్లో త‌న‌దైన శైలిలో కేకలు, అరుపులు, ఏడుపులు , పెడ‌బొబ్బ‌ల‌తో ర‌క్తిక‌ట్టిస్తూ, ఇంకా కావలసినన్నివి చేస్తూ షోను కాస్తో కూస్తో వీక్షకులు అటువైపు తొంగి చూసేలా చేసింది శ్రీముఖి అనే ఎవ‌రైనా చెపుతారు. ఇప్పుడు జ‌బ‌ర్ద‌స్థ్ నుంచి అన‌సూయ త‌ప్పుకోవ‌టంతో ఈ షోకి తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.


ఇప్ప‌టికే ఈ విష‌య‌మై శ్రీముఖి ని కూడా మ‌ల్లెమ‌ల యూనిట్ సంప్ర‌దించింద‌ని,  ఆమె కూడా జబర్దస్త్ షోకు పూర్తి బాధ్య‌త‌లందిస్తే…  చాలెంజిగా తీసుకుంటానని చెప్పిన‌ట్లు సమాచారం.   షోని మరో లెవల్లోకి తీస్కెళ్లేలా చేస్తాన‌ని,, పరోక్షంగా నాగబాబుకి సవాల్ విసిరిన‌ట్టు మాట్లాడుతోంద‌ట శ్రీముఖి. మ‌రిజబర్దస్త్ షోలోకి శ్రీముఖి ఎంట్రీ ఇస్తుందా?  లేదా అన్న‌ది ప‌క్క‌న పెడితే…జ‌బ‌ర్ద‌స్థ్‌తో  న‌వ్వుల న‌వాబుగా మారిన నాగ‌బాబు జ‌బ‌ర్ద‌స్త్ నుంచి బైట‌కొచ్చాక, జి లో చేస్తున్న షో లో తొలి ఎపిసోడ్‌లోనే తేలిపోయిన‌ట్టుంద‌ని,   మల్లెమాల టీంలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. జ‌బ‌ర్ద‌స్త్ నుంచి యాంక‌ర్‌తో స‌హా న‌టులెంద‌రిని తీసుకెళ్లినా, కొత్త‌వారికి ఛాన్సివ్వాల‌న్న త‌మ ఆకాంక్ష‌ని మ‌రోమారు నెర‌వేర్చుకునే అవ‌కాశం ద‌క్కిందంటున్నార‌ట శ్యాం ప్ర‌సాద్ రెడ్డి. మ‌రి జ‌బ‌ర్ద‌స్త్‌పై మ‌ల్లెమాల టీం  ఏం చేయబోతోందో మరికొన్ని రోజులలో తేలిపోనుంది.

Leave a Reply

Your email address will not be published.