గుంటూరు లో జనసేన “శంఖారావం”

ఈరోజు సాయంత్రం  (ఆదివారం)గుంటూరు లోని ఎల్ ఈ ఎం పాఠశాల మైదానం లో జనసేన పార్టీ శంఖారావం సభ నిర్వహించనున్నారు ఈ సభకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గం లకు విజయవాడ నుండి బయలు దేరి మంగళగిరి మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు, అనంతరం ర్యాలీగా బయలుదేరి గుంటూరు బహిరంగ సభకు చేరుకుంటారు.
ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఈ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఎన్నికల పొత్తులపై స్పష్టత ఇవ్వనున్నారని తెలిసింది. జనసేన పై టి డి పి , వై ఎస్ ఆర్ సి పి ఆడుతున్న మైండ్ గేమ్ కు ఈ సభ ద్వారా చెక్ పెట్టనున్నారని తెలిసింది. గుంటూరు లో గత సంవత్సరం ఫిబ్రవరి 14 న పార్టీ వ్యస్థాపక దినోత్సవం తర్వాత మళ్ళి  గుంటూరు లో భారీ బహిరంగ సభ లో పాల్గొంటున్న పవన్ టి డి పి, వై సి పి లపై విరుచుకు పడే అవకాశం ఉంది.

ఈసందర్భం గా  బహిరంగ  సభ ఏర్పాట్లను పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మరియు పార్టీ నాయకులు మాదాసు గంగాధర్ భైరా దిలీప్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.