కాంగ్రెస్ పార్టీ ఏమైనా ప్రాంతీయ పార్టీ అనుకుంటున్నావా? వి.హ‌నుమంత‌రావు.


త‌న ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏమైనా  ప్రాంతీయ పార్టీ అనుకుంటున్నావా? అంటూ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ వీహెచ్‌ రేవంత్‌ రెడ్డి పై ఘాటు వ్యాఖ్య‌లు చేసారు.  బుధ‌వారం ఆయ‌న మీడియాలో మాట్లాడుతూ  కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌పై రేవంత్‌ రెడ్డి డ్రోన్‌ ఎగురవేసిన కేసుకు పార్టీకి ఎలాంటి సంబంధంలే పోయినా, దానికి రేవంత్ ప‌దే ప‌దే పార్టీకి క‌ల‌గ‌ల‌ప‌టం స‌రికాద‌ని అన్నారు.   తనమీద వచ్చిన  భూక‌బ్జా ఆరోపణలపై సమాధానం చెప్ప‌లేని ప‌రిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని,  అందుకే వేరే వాళ్లపై ఆరోపణలు చేస్తు, కేటీఆర్ వ్య‌వ‌హారాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారాయ‌న‌. 

  111 జీవో పరిధిలో కాంగ్రెస్‌ వాళ్లకే ఎక్కువ ఫామ్‌ హౌస్‌లున్నాయని, రేవంత్ త‌ర‌హాలో మిగిలిన నేత‌లు కూడా ఫాంహౌజ్‌ల‌లోకి ప్ర‌వేశిస్తామ‌ని దాడులు చేస్తే ప‌రిస్థితి దేనికి దారితీస్తుంద‌ని నిల‌దీసారు.  రేవంత్‌ రెడ్డి త‌నొక్క‌డినే హీరో అనుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే తన వ్యక్తిగత విషయాలు కాంగ్రెస్‌ పార్టీకి అంటగట్టేస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ వ్య‌వ‌హార‌పై వ్యవహారంపై పార్టీలో చర్చ జరగాల్సి ఉంద‌ని ఈ విష‌యం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాల‌ని త‌ను భావిస్తున్న‌ట్టు చెప్పారు వి.హ‌నుమంత‌రావు. 

Leave a Reply

Your email address will not be published.