వైసిపి మాత మార్పిడిలను ప్రోత్సహిస్తుంది….చక్రపాణి మహారాజ్

ఏపీ మూడు రాజధానుల వ్యవహారం కాస్త ఢిల్లీకి చేరినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే వైసిపి సర్కారు అన్నింటా క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తోందని, తను ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు డబ్బులు లేక ఏం చేయాలో తెలియక ప్రాంతాల మధ్య చిచ్చు రేపేలా రాజధాని తరలింపు వ్యవహారం తెరమీదికి తీసుకువచ్చారంటూ అఖిల భారత హిందూ మహాసభ చైర్మన్ చక్రపాణి మహారాజ్ బిజెపి అధినేత అమిత్ షాను కలిసి సత్వరం జోక్యం చేసుకోవాలని కోరినట్టు సమాచారం. ఈ మేరకు మహారాజ్ ఢిల్లీలో అమిత్ షాకు జగన్ సర్కార్‌పై సంచలన ఆరోపణలతో ఫిర్యాదు చేస్తూ, జగన్ సర్కారు అమరావతి నుంచి రాజధానిని తరలించడం హిందూ సంస్కృతిని దెబ్బతీయడమేనని, రాష్ట్రంలో మత మార్పిడులకు పాలప్డుతూ హిందూత్వంపై జరుగుతున్న దాడి అనే భావన రాష్ట్ర ప్రజల్లో ఉందని, షాకు చెప్పినట్టు వినవస్తోంది.
అమరావతి ప్రాంతాన్ని గత తెలుగుదేశం ప్రభుత్వం రాజధానిగా ఎంపిక చేస్తే, దానిని విపక్ష నేతగా అంగీకరించిన జగన్ ఇప్పుడు మాట మారుస్తున్నారని, 33 వేల ఎకరాలను రైతులు అందచేయగా, ప్రధాని స్వయంగా రాజధానికి శంకుస్థాపన చేశారని, దీని అభివృద్ధికి కేంద్రం నుండి కూడా నిధులు మంజూరు అయిన విషయంతో పాటు అమరావతిని స్మార్ట్ సిటీగా కూడా కేంద్ర ఎంపిక చేసిందని, ఇన్ని ప్రత్యేకలున్న అమరావతిని జగన్ సర్కార్ కేవలం త వ్యక్తిగత విద్వేషాల కారణంగా రాజధాని రైతులతో పాటు యావత్ ఆంధ్రా ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అమిత్ షాకు వివరించినట్లు సమాచారం.
ఇప్పటికే రాష్ట్ర విభజనతో తీవ్రం నష్టంలో ఉన్న ఏపీకి ఇలా మూడు రాజధానులు 30 రాజధానులంటూ వైసిపి నేతలు జనంతో ఆటలాడుకుంటున్నారని, ఈ వ్యవహారంతో రాష్ట్రం మరింత నష్టపోయే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమరావతి విషయంలో జోక్యం చేసుకోవాలని హిందూ మహాసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.. ఏపీ రాజధానిగా అమరావతి ఉండేలా చర్యలు తీసుకోవాలని మహారాజ్ షాను కోరినట్లు తెలుస్తోంది.త్వరలోనే ఈ విషయంపై తను దృష్టి సారిస్తానని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తామని మహారాజ్‌కు షా హామీ ఇచ్చినట్టు సమాచారం. మరి ఏం జరగనుందని చూడాలి.