మహర్షితో కార్తీ మీటింగ్!

మహేష్  వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహర్షి’.  రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ సాగుతోంది. తాజా షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందని తెలుస్తోంది. సెట్స్‌లో పలువురు స్టార్లు మహేష్‌ను కలిసి అభిమానం చాటుకున్నారు.
కన్నడ స్టార్ హీరో శ్రీమురళి మహేష్ బాబును కలిసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తమిళ్ హీరో కార్తీ మహేష్ ను సెట్స్ లో కలిశారు. కార్త్తీ నటించిన ‘దేవ్’ ప్రేమికుల రోజు కానుకగా నేడు విడుదలైంది. ఇక మహేష్ నటిస్తున్న మహర్షి చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 25న విడుదల చేయనున్నామని దిల్ రాజు తెలిపారు. దిల్ రాజు పీవీపీ అశ్వనిదత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.