వంద మొక్కలు నాటండిఐఏఎస్‌ ఆఫీసర్‌కు కేరళ హైకోర్టు శిక్ష

వంద మొక్కలు నాటండి ఐఏఎస్‌ ఆఫీసర్‌కు కేరళ హైకోర్టు శిక్షఒక అప్లికేషన్‌పై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడంపై ఆగ్రహంఎక్కడ మొక్కలు నాటారో, ఏ మొక్కలు నాటారో చెప్పాలని సూచనసదరు ఆఫీసర్‌ ఆ రాష్ట్ర మంత్రి కుమారుడు
తిరువనంతపురం :
ఒక ప్రైవేట్‌ కంపెనీ పెట్టుకున్న ద‌ర‌ఖాస్తుపై తగిన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయ‌టంతో పాటు స‌ద‌రు అర్జీదారుతో  నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన అధికారికి కేర‌ళ హైకోర్టు వేసిన శిక్ష‌కు సామాజిక మీడియా నీరాజ‌నాలు ప‌డుతోంది. ఇందుకు సంబంధించిన వివ‌రాలలోకి వెళితే  కేర‌ళ  పరిశ్రమల శాఖకు 2016లో కోల్లాం ప్రాంతానికి చెందిన ఎస్‌ఎస్‌ కెమికల్స్ అనే కంపెనీ లైసెన్స్ కోరుతూ  దరఖాస్తు చేసుకుంది. అయితే గ‌త నాలుగేళ్లుగా స‌ద‌రు య‌జ‌మానుల‌ను రేపుమాపంటూ తిప్ప‌డం, కార్యాల‌యానికి వ‌స్తే నోటికొచ్చింది మాట్లాడుతూ నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్న ఆ శాఖ  డైరెక్టర్‌ కె. బిజు అనే  ఐఏఎస్  అధికారి వ్య‌వ‌హారంపై విసికిపోయారు. ఇన్నేళ్లయినా దానిపై ఏమీ తేల్చటం లేద‌ని, లైసెన్స్ లేని కార‌ణంగా త‌మ‌కు న‌ష్టం వాటిల్లుతోందంటూ స‌ద‌రు సంస్థ కేరళ హైకోర్టును ఆశ్రయించింది.
పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ బిజు నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆ ఐఏఎస్ అధికారి కె. బిజు ఆ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి కె. కృష్ణ కుట్టి కుమారుడు కావడం మీడియాలో చ‌ర్చ‌కు తెర‌లేచింది.  ఈ కేసు విచార‌ణ‌ల సంద‌ర్భంగా  స‌ద‌రు లైసెన్స్ ఇచ్చేందుకు ఆ సంస్ధ‌కు అర్హ‌త ఉందా? ఇస్తామో? ఇవ్వ‌మో? అని చెప్పేందుకు  మూడున్నర ఏళ్లు నాన్పుడు ధోర‌ణి అవ‌లంబించ‌డంపై నిల‌దీసింది. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు పరిశ్రమల శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇప్ప‌టికీ ఓ నిర్ణయం తో కోర్టు ముందుకు రాక‌పోవ‌టం స‌రికాద‌ని, ఇందుకు గానూ వంద మొక్కలు నాటాల్సిందిగా ఆదేశించింది. 
అక్క‌డితో ఆగిపోలేదు.  పబ్లిక్‌ ప్రదేశాల్లో వంద మొక్కలు నాటాలని,  ఎక్కడెక్కడ, ఏమేమి మొక్కలు నాటారో ఆ వివరాలను కూడా తమకు అందజేయాలని స్పష్టం చేసింది. ఈ త‌ర‌హా తీర్పుల‌లో స‌ద‌రు మొక్క‌ల సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లు కూడా వారికే అప్ప‌గిస్తూ  కోర్టు నిర్ణ‌యం తీసుకుంటే బాగుండేద‌న్న వాద‌న సోష‌ల్ మీడియాలో కోర్టు జ‌డ్జిమెంట్‌ని కోడ్ చేస్తూ, ప‌లు సూచ‌న‌లు ట్రోల్ చేస్తున్నారు నెటిజ‌న్లు. 

Leave a Reply

Your email address will not be published.