ప్రాస్టిట్యూట్ పాత్ర‌లో అక్కినేని కోడలు… చైతు ఏమ‌న్నాడంటే…?అక్కినేని నాగ చైతన్య నటించిన ‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది సమంత. ఈ సినిమాలో అత్యుత్తమ నటనను కనబరిచి ఎంతో పేరు సంపాదించుకుంది. దీని తర్వాత ఆమె మంచి మంచి అవకాశాలను దక్కించుకుంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ మార్కెట్‌ను సైతం పెంచుకుంది. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుని రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈమె సూపర్ ఫామ్‌లో ఉంది. కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతుంది సామ్..

చాలా మంది ఇళ్ళ‌లో పెళ్ళి త‌ర్వాత సినిమాలు చెయ్య‌డానికి ఒప్పుకోరు. ఎంతో మంది హీరోయిన్లు క‌నుమ‌రుగైన దాఖ‌లాలు కూడా ఎక్కువే.  కానీ ఇందుకు విరుద్ధంగా ఉంటారు ఈ జంట‌. అయితే అక్కినేని వారి పెద్ద కోడలు సమంతా మాత్రం అందుకు భిన్నం. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ తన స్టార్ ఇమేజ్ ని కాపాడుకుంటుంది. పెళ్ళికి ముందు కంటే పెళ్లి తర్వాతే ఆమె మంచి పాత్రల్లో నటించింది అనేది వాస్తవం. భిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తూ నటనను కూడా బయటపెడుతూ వచ్చింది. దీనితో కొన్ని పాత్రలకు సమంత అయితేనే బాగుంటుందనే రేంజ్‌లో పాత్ర‌ల‌ను ఎంచుకుంటుంది ఈ భామ‌.  ప్రస్తుతం ఆమె 96 రీమేక్ లో నటిస్తుంది. ఈ సినిమా పూర్తి కాకుండానే ఒక సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్కడో నెల్లూరు నుంచి పొట్టకూటి కోసం వచ్చిన 26 ఏళ్ళ అమ్మాయి, వ్యభిచారిగా ఏ విధంగా మారింది అనే కథలో సమంత నటించడానికి ఒప్పుకుంది.

వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని కూడా సమాచారం. ఈ నేపధ్యంలో దీనికి ఆమె భర్త నాగ చైతన్య అడ్డుకట్ట వేసినట్టు తెలుస్తుంది. లేడీ ఓరియంటెడ్ పాత్రలకు ఓకే గాని, అలాంటి పాత్రల్లో వద్దని, నీకో స్టార్ ఇమేజ్ ఉందని, మాస్ లో ఫాలోయింగ్ ఉంది కాబట్టి అలాంటి పాత్రలు చేస్తే చులకన అవుతావని, పెళ్ళికి ముందు అయితే పర్వాలేదు గాని ఇప్పుడు వద్దని చెప్పేశాడట. దీనితో సమంత ఆ సినిమా నుంచి డ్రాప్ అయినట్టు సమాచారం.

Leave a Reply

Your email address will not be published.