విజ‌య‌దేవ‌ర‌కొండ సినిమాలో అన‌సూయ‌

బుల్లితెర నుంచి వెండితెర పైన వరుస అవకాశాలతో దూసుకుపోతోంది నటి అనసూయ. జబర్దస్త్ కార్యక్రమంతో ఒక్కసారిగా హాట్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అనసూయకు సినిమాల్లో అప్పుడప్పుడు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఎఫ్‌-2 సినిమాలోను తెలుగు ప్రేక్షకులను అలరించిన అనసూయ తాజాగా విజయ్ దేవరకొండ సినిమాలో అవకాశం కోసం ప్రయత్నిస్తోందట. ఇప్పుడు ఇదే విషయం తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది.

విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి త్వరలో ఓ సినిమాను తీసేందుకు సిద్ధమయ్యారు. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో. హీరోయిన్‌తో పాటు దర్శకుడి కోసం వెతుకుతున్నారు. సినిమాలో ఒక ముఖ్యమైన రోల్ ఉంటుందని విజయ్ దేవరకొండ చెప్పారు. అది కూడా మహిళ పాత్ర అని చెప్ప‌గా అనసూయ ఆ క్యారెక్టర్ పై ఆశ పెట్టుకుంది. ఆ క్యారెక్టర్‌లో తను చేసేందుకు సిద్థమంటూ విజయ్ వెంట పడిందట. సాయంత్రమైతే విజయ్ దేవరకొండకు ఫోన్ చేయడం… అవకాశం ఇవ్వమని ప్రాధేయపడటం చేస్తోందట.

అయితే విజయ్ దేవరకొండ లాంటి పేరున్న హీరో సినిమాలో నటిస్తే క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందనేది అనసూయ ఆలోచనట. అయితే అనసూయ అయితే ఈ క్యారెక్టర్‌కు సరిపోతుందన్న నిర్ణయానికి వచ్చేశారట విజయ్ దేవరకొండ. త్వరలో ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరో కూడా విజయ్ ప్రకటించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.