లక్ష్మి రాయ్ తో పెద్దగొడవ పడ్డ అంజలి

తెలుగు ముద్దుగుమ్మ అంజలి షాపింగ్ మాల్, జర్నీలాంటి చిన్న సినిమాలతోనే తన కెరియర్ ఆరంభించి, గీతాంజలి సినిమాతో నటిగా తన మార్కు దక్కించుకుని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డిక్టేటర్ లలో వెంకీ, బాలయ్యల నరసన ఛన్సులందుకుని క్రమక్రమంగా అగ్ర కథానాయికగా ఎదిగింది. పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ తన నటనతో ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకుల మనసు దోచుకున్న అంజలి తాజాగా హిందీలోనూ నటిస్తోంది.
ఈ మధ్య బాలీవుడ్ భామ లక్ష్మి రాయ్ తో పెద్ద గొడవే చేసింది అంజలి. ఇదేదో ప్రేమ వ్యవహారం అనుకుంటే పొరపాటే విశాఖ ఎంపి ఎంవివి సత్యనారాయణ సమర్పణలో నిధి మూవీస్, హరివేన్ ఎంటర్ టైనమెంట్స్ సంయుక్తం గా నిర్మిస్తున్న‘ఆనంద భైరవి’ చిత్రం కోసం ఈ గలాటా చోటు చేసుకుంది.
బీరం తిరుపతి రెడ్డి-రమేష్ రెడ్డి ఇటికేల నిర్మాతలుగా కర్రి బాలాజీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు హైదరాబాద్ నానక్ రామ్ గూడలో ఈ గొడవ పడే సన్నివేశం చిత్రీకరించారు. లక్ష్మీరాయ్ ఊరమాస్ అనుకున్నా అంతకు మించి అంజలి కూడా ఆమెతో పోటీపడి తిట్లందుకునే సీన్లలో తెగ నటించేసారు. ఈ షూటింగ్ చూసిన స్థానికులు మన పక్కింటమ్మాయేనా ఇలా చెలరేగిపోయిందని ఔరా అనుకోవటం వినిపించింది.