ఆర్ఆర్ఆర్ రిలీజ్‌కి రెఢీ… అదే డేట్ నో డౌట్‌!


టాలీవుడ్ అగ్ర హీరోలైన ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో దర్శక దిగ్గజం రాజమౌళి గారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వ్యాల్యూస్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీం పాత్ర‌లో నటిస్తుండగా, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.

ఈ చిత్రం కథనానుసారంగా రెండు నిజ పాత్ర‌ల క‌ల్పిత క‌థాంశం మరియు ఇద్దరు స్వాతంత్ర సమరయోధులు కావడం విశేషం. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైంద‌ని ఇటీవ‌ల మేక‌ర్స్ తెలిపారు. అయితే 2020 జూలై 30న ఈ సినిమా విడుదలవుతున్నప్పటికి భారీ చిత్రం కావడం వల్ల, షూటింగ్ అనుకున్న విధంగా సాగకపోవడం వల్ల ఈ సినిమా విడుదల ఆలస్యమవుతుందని ఇటీవల వార్తలు వినిపించాయి. జూలై 30న కాకుండా, దసరాకు విడుదల అవుతుందన్న టాక్ వినిపించింది. అయితే అనుకున్న సమయం కంటే ముందే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తవుతోందని, జనవరి రెండో వారంలో షూటింగ్ పూర్తి అవుతుందని, నాలుగైదు నెలలు ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతాయని అనుకున్నట్టే జూలై 30వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కానుందని సమాచారం.

Leave a Reply

Your email address will not be published.