జగన్‌కు అలీ ఝలక్?

పవన్.. జనసేన స్థాపించిన తర్వాత 2019 ఎన్నికలకు ముందు ఆయన జనసేనాని సమక్షంలో అలీ పార్టీలో చేరతారని భావించినప్పటికీ.. కొన్ని రోజులు జనసేన.. మరికొన్ని టీడీపీ.. ఇంకొన్ని రోజులు వైసీపీ అధినేతల చుట్టూ తిరిగి తిరిగి చివరికీ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఆ పార్టీ తరపున ఎన్నికలలో ప్రచారం చేసిన ఫలితానికి ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్లలో ఏదో ఒకటి దక్కుతుందని భావించినా చివరికి నామినేటెడ్ పదవి కి కూడా కొరగాకుండా పోయానని ఆలీ అంతర్మధనం చెందుతున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే అలీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రత్యేకంగా వెళ్లారు. సాధారణంగా ఏ షూటింగ్ లో పాల్గొనేందుకే వెళ్లి ఉంటాడనుకుంటే షడన్‌గా బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షం కావటంతో అంతా నివ్వెర పోయారు. బిజెపి నేతలతో చర్చల అనంతరం తను అనుకున్నది జరిగితే త్వరలోనే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమేనని సన్నిహితులతో చెపుతున్నాడట అలీ.
ఈ మధ్య వరుసగా ఢిల్లీ హైదరాబాద్ అమరావతిల నడుమ చక్కర్లు కొడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ తో సంబంధాలు ఉన్నప్పటికి జనసేనలో కాకుండా బిజెపిలో చేరటం వల్ల ఇరు పార్టీల నడుమ స్నేహబంధాన్ని మరింత బలం చేసేందుకు ఉపయుక్తంగా ఉంటుందని కొందరి సూచనలతోనే అలీ కమలం పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. వస్తున్న కథనాలు వాస్తవమైతే టాలీవుడ్ కమెడియన్ అలీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఝలక్ ఇవ్వబోతున్నట్టే లెక్క.