ఓ పోలీస్ కానిస్టేబుల్ దొంగగా మారాడు….

కంచే చేనును మేసిన చందంగా ఢిల్లీ సమీపంలోని నోయిడాలో జరిగిన ఓ ఘ‌ట‌న కు సంభంధించిన వీడియో ఫుటేజ్ ఇప్పుడు స‌మ సామాజిక మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దొంగ‌ల నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు వీలుగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన‌ పెట్రోలింగ్ పోలీసులు పాల పేక‌ట్ల‌ని దొంగ‌త‌నం  చేస్తూ సీసీటీవీ కెమెరాకు చిక్కారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

 నొయిడాలోని ఓ దుకాణం ముందు  ఈనెల 19న  రాత్రి  పాల వ్యాన్ వచ్చింది. అందులోని సిబ్బంది పాల ప్యాకెట్ ట్రేలను నిత్యం ఉంచిన‌ట్టే ఆరు బయటే ఉంచి వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లిన నిమిషాల‌లో అదే దారిలో వ‌చ్చిన‌ పోలీసు పెట్రోలింగ్ వాహనం  నుంచి దిగిన ఓ కానిస్టేబుల్ పాల ట్రేల నుంచి పాల ప్యాకెట్లను దొంగలించి, పెట్రోలింగ్ వ్యాన్‌లో ఉన్న మరో కానిస్టేబుల్‌కు అందించాడు. ఇదంతా అక్కడ భ‌వ‌నానికి ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యింది.   ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ ఉన్నతాధికారులు సదరు కానిస్టేబుళ్ల‌నిను గుర్తించి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు. ఇదండీ సంగ‌తి.

Leave a Reply

Your email address will not be published.